Intinti Gruhalakshmi: సామ్రాట్ తో కలిసి ఫ్లైట్ లో వెళ్లిన తులసి.. కోపంతో రగిలిపోతున్న నందు..?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో బాగాంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి వైజాగ్ వెళ్లడానికి కుటుంబం అందరూ ఒకే చెబుతారు.

ఈరోజు ఎపిసోడ్ లాస్యతో నందు తులసి ప్రయాణం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు లాస్య అవకాశం దొరికింది కదా అని తులసి గురించి తప్పుగా మాట్లాడుతుంది. అంతేకాకుండా తులసికి ఒక దారి దొరికింది అనటంతో దగ్గర కావద్దు అని అంటాడు. అప్పుడు లాస్య, తులసి తను అనుకున్న కోరికలు నువ్వు తీర్చలేక పోయావు అందుకే ఇప్పుడు సామ్రాట్ తో వెళ్తుంది అన్న విధంగా మాట్లాడుతుంది.

Advertisement

దాంతో నందు గతంలో తులసి కోరికల గురించి రాసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత లాస్య ఇప్పుడు తులసికి సామ్రాట్ దారి దొరికింది అని ఇప్పటికే సామ్రాట్ తో ఉద్యోగంలో చేరి మొదటి అడుగు వేసింది అని ఇప్పుడు ప్రయాణంతో రెండు అడుగు వేసిందనీ వైజాగ్ నుంచి వచ్చాక మిగతా 5 అడుగులు వేస్తుందని అనడంతో నందు కోపంతో రగిలిపోతాడు.

మరొకవైపు తులసీ తన కుటుంబ సభ్యులతో కూర్చుని ప్రయాణం గురించి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు తులసి ప్రయాణం గురించి భయపడుతూ ఉండగా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అందరూ తులసికి ఏం కాదు అది ధైర్యం చెబుతారు. అంతేకాకుండా ప్రయాణానికి డబ్బులు ఎంతనో సామ్రాట్ ను అడుగుతాను అనటంతో ప్రేమ్ అలాంటిదేమీ ఉండదు నువ్వు ఆఫీస్ పని మీద వెళ్తున్నావు కాబట్టి సామ్రాట్ చూసుకుంటారు అని అంటాడు.

ఆ తర్వాత తులసి ప్రయాణంలో తినడానికి పులిహోర చేసుకొని వెళ్తాను అనడంతో అందరూ ఒక్కసారిగా నవ్వి అందులోనే ఫుడ్ పెడతారు అని అంటారు. ఇంతలోనే సామ్రాట్ ఫోన్ చేసి ఉదయాన్నే రెడీగా ఉండాలి అని ఫోన్ చేసి చెప్తాడు. ఆ తరువాత తులసి తన కుటుంబ సభ్యులతో మాట్లాడి వెళ్లి పడుకుంటుంది. ఆ తర్వాత తులసి ఉదయాన్నే తనకు సామ్రాట్ ఫోన్ చేసి ఫ్లైట్ ఆలస్యం అయ్యింది అన్న కల రావడంతో కంగారును పైకి లేచిన తులసి అనుకోకుండా కిందపడుతుంది.

Advertisement

అయితే ఇదంతా కూడా తన కళ అనుకుని ప్రయాణానికి సిద్ధమవుతుంది.. ఆ తర్వాత తులసి సామ్రాట్ పక్కన కూర్చుని ఫ్లైట్ లో వైజాగ్ వెళుతుంది. ఆ తర్వాత లాస్య ఇంటికి ఇద్దరు ఆడవాళ్లు వచ్చి ఆ తులసి పరాయి మగవాడితో బయటకు వెళ్ళింది అలాంటి వాళ్ళని ఏమంటారు తిరుగుబోతు అంటారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel