Intinti Gruhalakshmi serial September 27 Today Episode : తెలుగు బుల్లి తెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి చేసిన పనికి కుటుంబం అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ హనీ దగ్గర కూర్చొని ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలో హనీ నిద్ర లేచి ఎందుకు నాన్న అమ్మ గురించి అందరి ముందు నిజం చెప్పలేదు కనీసం నాకు అయిన నిజం చెబుతావా అని అంటుంది. కానీ సామ్రాట్ మాత్రం మౌనంగా ఏం చెప్పకుండా బాధతో హనీ నీ పడుకోమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు సామ్రాట్ బాధపడుతూ ఉండగా ఇంతలో వాళ్ళ బాబాయ్ ఈరోజు తులసి ధైర్యం చేసి మాట్లాడకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉండేవో అని అంటాడు.
మరి నువ్వు ఎందుకు విషం చెప్పలేదు సామ్రాట్ అని అనగా అని మనసు పాడవుతుంది అని చెప్పలేదు బాబాయ్ అని అంటాడు. మరి ఈ విషయంలో ఎన్ని రోజులు దాస్తావు అని అడగగా దీనికి నా దగ్గర సమాధానం లేదు బాబాయ్ అని అంటాడు సామ్రాట్. కానీ తులసి గారు నన్ను అర్థం చేసుకుంటారు నా కంపెనీని నడిపిస్తారు ఆ ధైర్యం నాకుంది అని అంటాడు సామ్రాట్.
మరొకవైపు అభి జరిగినదంతా తలచుకుంటూ ఉండగా ఇంతలో లాస్య దంపతులు అక్కడికి వచ్చి అభి ని మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది లాస్య. అప్పుడు నందు కూడా అభినయ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతాడు. తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. అప్పుడు తులసి కుటుంబం ఇంటికి బయలుదేరుతూ ఉండగా హనీ, ఇక్కడే ఉండండి ఆంటీ అని బ్రతిమలాడుతూ ఉంటుంది.
Intinti Gruhalakshmi serial Sep 27 Today Episode : సామ్రాట్ ఎమోషనల్‌గా ఏడ్పించేశాడు.. సీరియల్‌లో ఇదే హైలెట్ సీన్..
అప్పుడు తులసి నచ్చజెప్పి వెళ్తూ ఉండగా సామ్రాట్ రేపు ఆఫీస్ లో కలుసుకుందాం అని అంటాడు. వెంటనే అభిషేకంతో రేపటి నుండి మామ్ మీతో కలిసి పని చేయదు ఈరోజే చివరి రోజు అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతాడు. అప్పుడు తులసి కోప్పడుతూ పెద్దవాళ్లతో అలా మాట్లాడకూడదు అవి అని అనగా కానీ అవి తులసి మాటలు పట్టించుకోకుండా నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ సామ్రాట్ ని బాధపెడుతూ ఉంటాడు.
మన భార్య గురించి అడిగితే ఎందుకు నోరు మెదపలేకపోతున్నారు అని గట్టిగా నిలదీస్తాడు అభి. ఇప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అభి నీ ఆపడానికి ప్రయత్నం చేసినా కూడా అభి మాత్రం పట్టించుకోకుండా భార్య చనిపోయిందా లేకపోతే చంపేశారా అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతాడు. వెంటనే సామ్రాట్ వాళ్ళ బాబాయ్ చాలు అభి అంటూ అసలు విషయాన్ని బయట పెట్టేస్తాడు.
సొంత చెల్లి కోసం జీవితాన్ని త్యాగం చేసిన హంతకుడు, కూతురు గాని కూతురు కోసం తన పెళ్లిని కూడా త్యాగం చేసిన హంతకుడు మీలాంటి వాళ్ళు నిందలు వేస్తే హనీ తన కూతురు కాదు తన చెల్లెలు కూతురు అన్న నిజాన్ని గుండెలో మోస్తున్న హంతకుడు అని అసలు నిజాలు బయట పెట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
Read Also : Intinti Gruhalakshmi: మీడియాపై ఫైర్ అయిన తులసి..అభి నోరు మూయించిన అనసూయ..?