Intinti Gruhalakshmi june 4 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో అంకిత తులసికి ఫోన్ చేసి మీరు ఎన్ని చెప్పినా నేను నీతో మాట్లాడటం మానేయమను అని అంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో అంకిత ఎమోషనల్ అవుతూ మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే నేను ఇష్టం లేకపోయినా బయటకు వచ్చినందుకు మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా అని అడుగుతుంది. దివ్య కూడా తులసి పై ఫైర్ అవుతూ మామ్ నువ్వు దివ్య వదినnu బాధ పెట్టకు దివ్య వదిన చాలా మంచిది అని చెబుతుంది. మరొకవైపు తులసి కోసం లాస్య ఎదురుచూస్తూ ఉంటుంది.

ఇంతలో తులసి అక్కడికి రావడంతో లాస్య కావాలనే తులసిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది. నీకు పార్టీలో బాగా అవమానం జరిగిందిగా అని లాస్య అనగా నాక ఎం జరిగింది.. నాకు అంకిత ఫుల్ సపోర్ట్ ఇచ్చింది.. నీకు కదా అవమానం జరిగింది అని లాస్యకు స్ట్రాంగ్ గా బుద్ది చెబుతుంది.
నీది మీ ఆయనది ఒంకర బుద్ది.. నువ్వు మీ అయన అక్కడ కోడలు పుట్టినరోజు ఎందుకు జరిపారో నాకు తెలుసు..అంకితకు వచ్చిన కోట్ల ఆస్తి కోసం మీరు ఈ ప్లాన్ వేశారు అని అంటుంది తులసి. దీంతో షాకైనా లాస్య త్వరలోనే నీ పిల్లలు నీకు దూరం అవుతారు అని అనగా.. నా భర్త దూరం అవ్వడంలో అతనిది తప్పు ఉంది కాబట్టే నేను వదిలేసా.. నా పిల్లల జోలికి వస్తే మాత్రం రక్తం కళ్ల చూడాల్సి వస్తుంది అని లాస్యకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది తులసి.
మరొకవైపు ప్రేమ్ జరిగిన అవమానాల గురించి తలుచుకొని బాధ పడుతుంటాడు. శృతి మాట్లాడుతూ ఏం జరిగింది అని అడుగుగా రాత్రి పార్టీలో అందరూ ఉన్న ఎవరు లేనట్టే ఉంది అంటాడు. అయిన తల్లే దూరం పెట్టినప్పుడు మిగితా వాళ్ళు ఎంత అని అనగా అలా అనకు మీ అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం అని శృతి, ప్రేమ్ ను ఓదారస్తుంది.
ఒకవైపు అభివృద్ధి కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో తులసి వస్తుంది. అయితే తులసి తనము నిలదీయడానికి పిలిచింది అని తెగ టెన్షన్ పడిపోతూ వుంటాడు. ఇంతలో వెళ్ళిపోదామా అనుకుంటున్న సమయంలోనే తులసి కనిపించడంతో ఆగిపోతాడు. ఆ తర్వాత అభిని కూర్చోపెట్టి డబ్బు పరంగా కెరీర్ పరంగా మంచి మంచి సలహాలు ఇస్తుంది.
అప్పుడు అభి మామ్ తో జాగ్రత్తగా మాట్లాడాలి అనుకుంతటాడు. ఆ తర్వాత గాయత్రి ఫోన్ చెయ్యగా మాట్లాడు నాన్న అని చెప్తూ.. మన ఇంట్లో నీకు దొరకని గుర్తింపు ఆ ఇంట్లో దొరుకుతుంది.. మీ అమ్మకు లేని నమ్మకం మీ అత్త గారికి నీమీద ఉంది అంటుంది. నీకు ఆస్తి ఎలా కలిసోస్తుంది మంచిదే అని అనడంతో షాక్ అవుతాడు అభి.
Read Also :Intinti Gruhalakshmi june 2 Today Episode : ప్రేమ్ ని అవమానించిన నందు.. బాధతో కుమిలిపోతున్న అంకిత..?
- Intinti Gruhalakshmi: హనీ నీ ఇంటికి తెచ్చుకోవాలి అనుకుంటున్న తులసి..అసలు నిజం తెలుసుకున్న లాస్య..?
- Intinti Gruhalakshmi july 19 Today Episode : ప్రేమ్ ని దారుణంగా అవమానించిన ఓనర్.. అతని విషయం తెలుసుకొని కుమిలిపోతున్న ప్రేమ్..?
- Intinti Gruhalakshmi March 5 Today Episode : లాస్య మాస్టర్ ప్లాన్.. ప్రేమ్‌ని బయటకు గెంటేసిన తులసి..?













