Malli Serial July19 Today Episode : నా హక్కును నాకు ఇస్తారా బాబూ గారూ.. మల్లిని వదిలేయాలన్న అరవింద్ ఉద్దేశం తల్లికి తెలిస్తే..?

Malli Serial July19 Today Episode : Malli Asks Arvind to give her right back, he wants leave malli from his life in Today Episode
Malli Serial July19 Today Episode : Malli Asks Arvind to give her right back, he wants leave malli from his life in Today Episode

Malli Serial July19 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే మల్లి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గత ఎపిసోడ్ లో మల్లి తాను చేసిన పనులకు బదులుగా అరవింద్‌కి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ భాగంగా ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మల్లి అరవింద్ చేతికి డబ్బులు ఇస్తుంటే అప్పుడు అరవింద్ మా వాళ్లు నిన్ను సొంత మనిషి అనుకొని ఇవన్నీ చేశారని అంటాడు. వాటిని కూడా నువ్వు వెల కడతావా అని అంటాడు. ఇలా అన్నింటికీ వెల కట్టడం నేను మీ దగ్గర నేర్చుకున్నాను బాబు గారు అంటుంది మల్లి. అప్పుడు అరవింద్ నేను నీకు డబ్బులు ఇచ్చింది నీ చదువుకి ఉపయోగపడతాయని. అంతేకాకుండా అది మీ హక్కు కూడా అంటాడు అరవింద్. అప్పుడు మల్లి ఏ హక్కు గురించి మాట్లాడుతున్నారు బాబు గారు నా హక్కును నాకు ఇస్తారా అని అంటుంది. మీకు నాకు ఏం సంబంధం లేదని మీరే చెప్పారుగా బాబు గారు. అలాంటప్పుడు మీరు ఇచ్చే డబ్బులు నేను ఎలా తీసుకుంటాను అని చెప్పి అరవింద్ చేతిలో డబ్బులు పెట్టి అక్కడ నుండి వెళ్ళి పోతుంది.

Malli Serial July19 Today Episode : Malli Asks Arvind to give her right back, he wants leave malli from his life in Today Episode
Malli Serial July19 Today Episode 

మాలిని వాళ్ల నాన్నగారు మల్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తాను ఇక్కడ ఉన్నప్పుడు మీరా గురించి అడగడం సాధ్యం కాలేదు. మల్లి నీ మీరాకి ఏమైనా చెప్పమని చెప్పినా చెబుతుంది. మీరా మన ప్రేమ ప్రయాణం చందమామ కలువ పువ్వు ప్రేమ కథల మిగిలిపోతుంది ఏమో అనుకున్నాను. మల్లి ద్వారా మన ప్రేమకు దారి దొరుకుతుంది. ఇప్పుడు మల్లితో మాట్లాడాలంటే అరవింద్‌కి కాల్ చేయాలి అని అనుకుంటాడు. అరవింద్‌కి కాల్ చేస్తే మీరా విషయం తెలిసిపోతుంది. పొరపాటున మాలిని ద్వారా వసుంధర కి తెలిస్తే పెద్ద ఇష్యూ చేస్తుంది. అరవింద్‌కి కాల్ చేయకూడదు అనుకుంటాడు. అసలు ఈ జన్మలో మనం కలుస్తామ అని మీరాను తలుచుకుంటూ బాధపడతాడు.

Advertisement

ఇక మల్లి వాళ్ళ అమ్మ జ్వరంతో మల్లినీ కలవరిస్తూ ఉంటుంది. అప్పుడు సత్య మీరా దగ్గరికి వచ్చి ఆమెను పైకి లేపి కూర్చో పెడతాడు. మల్లి వాళ్ల ఇంట్లోకి వస్తూ నిన్ను చూస్తున్నాను అన్న సంతోషం కొన్ని గంటలు కూడా లేకుండా పోయింది. ఇప్పుడు నా మొహం నీకు ఎలా చూపించాలి అమ్మ అని బాధ పడుతూ ఇంట్లోకి వస్తుంది. మల్లి నాకోసం వచ్చింది.. సత్య నా బిడ్డ నిన్ను పిలుస్తుంది అంటూ మీరా పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. అక్కడికి వచ్చిన మల్లి వాళ్ళ అమ్మని చూసి పరిగెత్తుకుంటూ వస్తూ గట్టిగా కౌగిలించుకుంటుంది. అప్పుడు మీరా సంతోషంతో నేను చెప్పానుగా సత్య నా బిడ్డ నన్ను చూడకుండా ఉండలేదని అంటుంది. అప్పుడు మల్లి మీరాని పట్టుకొని ఏంటమ్మా నీ ఒళ్లంతా ఇలా కాలిపోతుంది.. నీకు జ్వరం వచ్చిందా అంటుంది. అప్పుడు మీరా నాకేం కాలేదు అంటుంది. దొరబాబు గారు ఎక్కడ అని మల్లిని అడుగుతుంది.

Malli Serial July19 Today Episode : నా మొహం నీకు ఎలా చూపించాలి అమ్మ.. బాధ పడుతూ ఇంట్లోకి వచ్చిన మల్లి..

Malli Serial July19 Today Episode : Malli Asks Arvind to give her right back, he wants leave malli from his life in Today Episode
Malli Serial July19 Today Episode 

అప్పుడు మల్లి అమ్మ నీకు ఎంత జ్వరంగా ఉంది. బాబు ఆర్ఎంపీ డాక్టర్‌ని పిలువు అని సత్యకి చెప్పి మీరాని ఇంట్లోకి తీసుకొని వెళుతుంది. అరవింద్ రూమ్ కోసమని రిసార్ట్‌కి వెళ్తాడు. అక్కడ రిసెప్షన్‌లో ఉండే ఒక ఆవిడ అరవింద్‌ని గుర్తుపట్టి మల్లి గురించి వివరాలను అడుగుతుంది. వెంటనే అరవింద్ కోపంతో మీ పని ఏంటో మీరు చూసుకుంటే బాగుంటది నా పర్సనల్ విషయాలలో తలదురిస్తే.. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటాడు. అప్పుడు తాను సారీ సార్ క్యాజువల్‌గా అడిగాను అని అరవింద్‌కి రూమ్ కీ ఇస్తుంది. ఇక మాలిని బ్రదర్ శశాంక్ తను ఒక అమ్మాయి తో బెట్ కట్టిన విధంగానే అమ్మాయి వేసుకున్న డ్రెస్ కలర్ లోనే రెడ్ కలర్ కార్ వేసుకుని వస్తాడు.

Advertisement

ఇక ఆ అమ్మాయి ఇదంతా కోఇన్సిడెన్స్ అంటూ అక్కడి నుండి వెళ్లిపోతుంది. అప్పుడు శశాంక్ ఆమె దగ్గరికి వెళ్లి బెట్ అంటే బెట్టె నేను అడిగినట్టు నువ్వు నాకు నెంబర్ చెప్పాలి. ఒకవేళ నువ్వు ఇదంతా కామన్.. అనుకుంటే రేపు నిన్ను కలవను కదా? ఒకవేళ రేపు నిన్ను కలవకపోతే ఇక జన్మలో నేను నిన్ను కలవను ప్రామిస్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇకపోతే రాజి, రాజీ వాళ్ళ అమ్మగారు చెస్ ఆడుతూ ఉంటారు. మాలిని రాజీ వాళ్ల అమ్మకి హెల్ప్ చేస్తుంది. ఎక్కడ నేర్చుకున్నావు వదిన అని రాజీ మాలినిని అడగగా.. అరవింద్ దగ్గర నేర్చుకున్నాను అని చెప్తుంది. అప్పుడు మాలిని వాళ్ళ అత్తగారు అక్కడికి వచ్చి నీకు ఏం వంట చేయను మాలిని అని అడుగుతుంది. ఏం వద్దు అత్తయ్య ఇవాళ నేనే వంట చేస్తాను. నాకు ఇష్టమైన వాళ్ళకి నా చేతులతో వంట చేయడం నాకు చాలా ఇష్టం అంటుంది మాలిని.

Malli Serial July19 Today Episode : Malli Asks Arvind to give her right back, he wants leave malli from his life in Today Episode
Malli Serial July19 Today Episode 

నేను మల్లి అంత బాగా చేయకపోయినా పర్లేదు కొంచెం మంచిగానే చేస్తాను అని అంటుంది మాలిని. అప్పుడు వాళ్ళందరూ మల్లినే అన్ని పనులు చేసేది ఒక్కరిని కూడా ఏ పని చేయనిచ్చేది కాదు మనమంతా మల్లిని చాలా మిస్ అవుతున్నామని అనుకుంటారు. అప్పుడు అరవింద్ మాలినికి కాల్ చేస్తాడు. మాలిని నేలకొండపల్లి చేరుకున్నారా అని అడుగుతుంది. మల్లి పక్కన ఉందా ఒకసారి మల్లికి ఇవ్వండి. మళ్లీ వాళ్ల అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది. అప్పుడు అరవింద్ కోపంతో మల్లిని నేను వాళ్ల ఇంట్లో వదిలేశాను నేను వేరే ఊర్లో లాడ్జిలో ఉంటున్నాను అని చెప్తాడు.

Advertisement

ఏమైంది అరవింద్ ఎందుకంత కోపం.. నీ మాటలు విని అత్తయ్య చాలా బాధపడుతుంది అంటుంది మాలిని. ఒకవేళ ఏదైనా పని నీ మనసుకి నచ్చకపోయినా ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటారు అంటే నువ్వు ఆ పని చెయ్ ఓకే రిలాక్స్ అవ్వు నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి మాలిని కాల్ కట్ చేస్తుంది. మల్లి వాళ్ళ అమ్మగారిని డాక్టర్‌కి చూపిస్తుంది. అప్పుడు మీరా నాకు డాక్టర్ అవసరం లేదు.. మల్లినే నా సంజీవని అంటుంది. సత్యతో అప్పుడు మీరా వాళ్ల అమ్మ.. మల్లి ఒక్కతే వచ్చింది అది గమనించారా లేదా అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దాం.

Read Also : Devatha july 19 Today Episode : మాధవ మాటలకు కోప్పడిన రాధ.. ఆదిత్య గురించి గొప్పగా పొగిడిన దేవి..?

Advertisement