Karthika Deepam Nov 1 Today Episode : కార్తీక్, దీప ల కోసం ఎదురుచూస్తున్న శౌర్య.. బాధతో కుమిలిపోతున్న వంటలక్క..?

Karthik consoles a heartbroken Deepa in todays karthika deepam serial episode
Karthik consoles a heartbroken Deepa in todays karthika deepam serial episode

Karthika Deepam Nov 1 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దీప, కార్తీక్ లు సౌర్య దగ్గరికి వెళుతూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో ఆటోలో ఇంటికి వెళ్తూ బాధపడుతూ మనసు చంపుకొని నిన్ను మా దగ్గర ఉంచుకున్న నువ్వు తల్లిదండ్రుల గురించి బాధపడుతుంటే ఆ బాధను నేను చూసి తట్టుకోలేను జ్వాలమ్మ అని బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు శౌర్యకి ఫంక్షన్ చేస్తూ ఉంటారు. ఇక ఇంద్రుడు ఆటో వెనకాలే దీప వాళ్ళు ఆటోని ఫాలో అవుతూ వస్తూ ఉంటారు. అప్పుడు దీప సౌర్య ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆత్రుతగా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది.

Advertisement
Karthika Deepam Nov 1 Today Episode
Karthika Deepam Nov 1 Today Episode

ఇప్పుడు కార్తీక్ అక్కడ ఉన్నది శౌర్య కాదేమో దీప అని అనడంతో వెంటనే దీప ఎందుకు డాక్టర్ బాబు పదేపదే అలా అక్కడ సౌర్య ఉన్నది కాదు అంటున్నాడు అని ఆలోచనలో పడుతుంది. అప్పుడు కార్తీక్ అక్కడ సౌర్య ఉండే చాలు అంతకంటే ఇంకేం అవసరం లేదు అని అనుకుంటూ ఉంటాడు. దీప నమ్మకం నిజం అయితే చాలు అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇంద్రుడు కార్తీక్ దీపలను ఇంట్లోకి పిలుచుకొని వెళ్తాడు. సౌదీకి ముత్తైదువులు ఫంక్షన్ జరుపుతూ ఉండగా శౌర్యకి తన అమ్మానాన్నలు వచ్చినట్టు అనిపించడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో ఇంద్రమ్మ వచ్చి అడ్డుపడుతుంది.

ఆ తర్వాత ఇంద్రమ్మ దీప దంపతుల దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఇంద్రుడు దీపని ఇంద్రమ్మకు పరిచయం చేస్తూ ఉండగా వెంటనే ఇంద్రమ్మ అమ్మగారు నాకెందుకు తెలియదు గండ జ్వాలమ్మకి ఆరోజు వాటర్ బాటిల్ ఇచ్చింది అమ్మగారే అని అంటుంది. అప్పటినుంచి మా జ్వాలమ్మ నిన్ను ఒక్కసారైనా చూసి థాంక్స్ చెప్పాలని అనుకుంటుంది అని అంటుంది ఇంద్రమ్మ. మరొకవైపు శౌర్య బయటకు రావాలి అని ప్రయత్నిస్తూ ఉండగా అక్కడున్న ఆడవారు బయటకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటారు.

Advertisement

ఇంతలోనే ఇంద్రుడు అమ్మగారు పాపను చూడడానికి వచ్చారు పాపను చూపించు అనడంతో ఇంద్రమ్మ లోపలికి వెళ్లి సౌర్యకు బదులుగా వేరే అమ్మాయిని తీసుకుని వస్తుంది. సౌర్యక బదులుగా వేరే అమ్మాయి బయటకు రావడంతో అది చూసి దీప,కార్తీక్,ఇంద్రుడు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇప్పుడు దీపా ఎమోషనల్ అవుతూ ఈ అమ్మాయేనా మీ అమ్మాయి అనడంతో అవునమ్మా అంటూ ఇంద్రమ్మ దీపకీ అబద్ధం చెబుతుంది. తర్వాత దీప ఎమోషనల్ అవుతూ పాపను దీవించడంతో కార్తీక్ కూడా పాపను దీవిస్తాడు.

Karthika Deepam నవంబర్ 1 ఎపిసోడ్ : దీపను ఓదారుస్తాడు కార్తీక్..

ఆ తర్వాత దీప అక్కడి నుంచి కార్ దగ్గర నిలబడి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నువ్వు సౌర్య ఊహలోనే ఉండి సౌర్య గురించి ఆలోచిస్తున్నా కాబట్టి అలా అనిపించిందేమో ఇక్కడ సౌర్య లేదు వెళ్దాం పద అని దీప అని అక్కడ నుంచి పిలుచుకొని వెళ్తాడు. అప్పుడు శౌర్య ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉండగా ఇంద్రమ్మ అడ్డుకొన సౌర్య లోపల పెట్టి బయట తలుపులు వేస్తుంది. అప్పుడు ఇంద్రుడు,ఇంద్రమ్మ ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా.

Advertisement

జ్వాలమ్మని తన అమ్మ నాన్నలకు అప్పగిద్దాం అనుకున్నాం కదా అని అనడంతో వెంటనే ఇంద్రమ్మ లేదు గంట వాళ్ళు మన ఇంటికి వస్తారు అన్నప్పటి నుంచి నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావు నీకే తెలియడం లేదు అని అంటుంది. అయినా ఆ పాపం మూటకట్టుకుంటావా ఇంద్రమ్మ నాలుగు నెలలకి నువ్వు అలా అంటే వాళ్ళు కనిపించిన ప్రేమ చూసావు కదా వాళ్ళు ఎంత నిరాశతో వెళ్లిపోయారు అనడంతో పర్లేదులే గండ నాకు నీకంటే ఏది ముఖ్యం కాదు నేను ఎలాగో అలాగా గుండె ధైర్యం చేసుకునే ఉండగలను కానీ నువ్వు ఉండలేవు గండ అని అంటుంది ఇంద్రమ్మ .

నాకు నా మాంగళ్య బలం కంటే తల్లి ప్రేమ గొప్పది కాదు అనిపించింది అందుకే ఇలా చేశాను అని చెప్పి ఇంద్రమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ఇంద్రుడు ఆలోచనలో పడతాడు. మరొకవైపు కారులో వెళుతున్న దీప శౌర్య గురించి తెలుసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఆ దేవుడు నాకు మళ్ళీ నిరాశ మిగిల్చాడు డాక్టర్ బాబు ఎంతో ఆశతో వెళితే అక్కడ అలా జరుగుతుంది అని ఊహించలేదు అని బాధపడుతూ ఉండటంతో కార్తీక్ ఓదారుస్తాడు.

Advertisement

Read Also : Karthika Deepam Oct 31 Today Episode : సౌర్య విషయంలో నిర్ణయాన్ని మార్చుకున్న ఇంద్రుడు.. సౌర్య దగ్గరికి చేరుకున్న కార్తీక్, దీప..?

Advertisement