Intinti Gruhalakshmi August 2 Episode : కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ విశేషమైన ఆదరణ సంపాదించుకుని దూసుకుపోతుంది. ఈ సీరియల్ కూడా ప్రస్తుతం అత్యధిక రేటింగ్ సంపాదించుకొని విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకుంది. ఇకపోతే నేటి ఎపిసోడ్ లో భాగంగా సామ్రాట్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే హనీ బాధపడుతూ కూర్చొని ఉంటుంది. ఎందుకు అలా ఉన్నావు హనీ అంటూ సామ్రాట్ అడగగా హనీ మాత్రం తనకు స్కూల్ నుంచి ఇంటికి రాగానే తనను పలకరించడానికి ఇంట్లో ఒక్కరు కూడా లేరని బాధపడుతుంది.నేను స్కూల్ నుంచి ఇంటికి రాగానే నాతో ఆడుకోవడానికి నాకు కథలు చెప్పడానికి ఎవ్వరూ లేరు ఒక పని వాళ్ళు తప్ప.
పని వాళ్లు కూడా నన్ను చూస్తేనే అంత దూరం వెళ్లిపోతారు. నాతో మాట్లాడడానికి వాళ్లు కూడా భయపడతారు. నాకు ఏదైనా జరిగితే నువ్వు వాళ్లపై కోపం తెచ్చుకుంటావని బిక్కుబిక్కుమంటూ ఉంటారనీ హనీ బాధపడగా సామ్రాట్ తన మాటలు విని అంతేనా రేపటి నుంచి నీకోసం త్వరగా ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేస్తాను ప్రేమగా గోరుముద్దులు తిని పెడుతూ మంచి మంచి కథలు చెబుతూ ఆడిస్తాను అంటూ సామ్రాట్ చెబుతాడు.ఇలా ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పావు డాడీ పిల్లలకి ఇలా అబద్ధాలు చెప్పకూడదని తెలియదా అంటూ అని బాధపడుతుంది. తులసి ఆంటీ వాళ్ళ ఇంట్లో చూడండి ఎంతమంది ఉంటారు అందరూ ఎంతో సరదాగా గడుపుతారనీ హనీ బాధపడుతుంది.
మన ఇంట్లో ఎందుకు లేరు అని హనీ అడగగా సామ్రాట్ గతంలో తన చెల్లెలు అన్నయ్య నన్ను క్షమించు… నేను మోసపోయాను… నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను అంటూ తన చెల్లి అన్న మాటలను గుర్తు చేసుకొని బాధపడతారు.ఇలా సామ్రాట్ బాధపడుతుంటే హనీ తన వల్లే తన డాడీ అప్సెట్ అయ్యారని సారీ డాడీ ఎప్పుడు నిన్ను బాధ పెట్టను అంటూ సామ్రాట్ కి సారీ చెబుతుంది. అంతలో సామ్రాట్ బాబాయ్ రావడంతో చెల్లెలు గుర్తొచ్చింది బాబాయ్ అంటూ చెబుతాడు.ఇలా సామ్రాట్ బాధపడుతుంటే గతం మర్చిపో సామ్రాట్ ఏం చేయాలో అది నేను చేస్తాను అంటూ వెంటనే తులసికి ఫోన్ చేస్తాడు.
తులసికి ఫోన్ చేసిన సామ్రాట్ బాబాయ్ తులసి ఒక సహాయం కావాలి చేస్తావా అమ్మ అని అడగగా చెప్పండి అంటూ తులసి అడుగుతుంది .గత కొద్ది రోజుల నుంచి హనీ బాగా డల్ అయిపోయింది. తను ఇలా కావడానికి కూడా కారణం మీరే. మీ ఇంట్లో లాగా తన ఇల్లు ఉండాలని కోరుకుంటుంది. అందుకే ఇంట్లో చిన్న పార్టీ అరేంజ్ చేసాము తప్పకుండా మీ ఫ్యామిలీ మొత్తం రావాలి అని అడుగుతారు.ఈ విధంగా సామ్రాట్ బాబాయ్ తులసిని పార్టీకి రమ్మని ఆహ్వానించడంతో తులసి తప్పకుండా వస్తామని చెబుతుంది. ఇక సామ్రాట్ నందు లాస్య అని కూడా ఇన్వైట్ చేస్తారు.
Intinti Gruhalakshmi August 2 Episode: నందు, లాస్యలకు సామ్రాట్ ఆహ్వానం
నందు మాత్రం ఈ పార్టీకి తాను రానని లాస్యతో చెబితే ఎందుకు రావని లాస్య ప్రశ్నిస్తుంది. నువ్వే చెప్పావు కదా తులసి సామ్రాట్ దగ్గరవుతున్నారని ఆ భాగోతం అక్కడికి వచ్చి నేను చూడలేను అంటూ నందు మాట్లాడుతారు. ఇక తులసి దగ్గరకు వెళ్లి నువ్వే తన భర్త అనే విషయం సామ్రాట్ కి చెప్పవద్దని చెప్పు అలా చెబితే కనుక సామ్రాట్ మన ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తారు అంటూ లాస్య నందుకు చెబుతుంది. లాస్య అలా చెప్పేసరికి నందు తులసి దగ్గరకు వెళ్లి అసలు విషయం చెప్పగా నేను ఈ విషయం చెప్పను కానీ అబద్ధం కూడా తాను చెప్పనని నందుతో చెబుతుంది. ఇలా ఈ కార్యక్రమం పూర్తికాగా తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.