Gruhalakshmi Fame: బుట్ట బొమ్మ అంటూ అదిరిపోయే స్టెప్పులు వేసిన గృహలక్ష్మి సీరియల్ తులసి..!

Gruhalakshmi Fame: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహ లక్ష్మి సీరియల్ ఒకటి. ప్రతిరోజు ప్రసారమవుతుంది ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సీరియల్ తులసి పాత్రలో నటించిన హీరోయిన్ కస్తూరి ఈ పాత్రలో ఎంతో ఒదిగిపోయారు.ఒకానొక సమయంలో వెండితెరపై పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన కస్తూరి ప్రస్తుతం సీరియల్ ద్వారా ప్రేక్షకులను చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ కార్యక్రమానికి ఈమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇలా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవహరించిన ఈమె ఈ కార్యక్రమం ద్వారా కంటెస్టెంట్ లు చేసిన ఆటపాటలను చూస్తూ ఎంతో ఎంజాయ్ చేశారు.అలాగే ఈమె కూడా తనదైన శైలిలో అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేసే ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ పూజా హెగ్డే నటించిన బుట్ట బొమ్మా..అనే పాటకు అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.ఇక ఈమె డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి మనం రోజు చూస్తున్న తులసినేనా ఇక్కడ అనేలా అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు.

ఇక తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అందరినీ మెప్పించిన కస్తూరి అనంతరం మాట్లాడుతూ ప్రతి రోజు సీరియల్స్ లో ప్రతి ఒక్కరిని ఎప్పుడు ఏడుస్తూ చూసి చూసి విసుగు వచ్చింది. ఇలా బుల్లితెర నటీనటులందరిని ఈ వేదిక పై ఇలా చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.ఈమె సినిమాల విషయానికి వస్తే నాగార్జున నటించిన అన్నమయ్య సినిమాలో రమ్యకృష్ణ చెల్లెలి పాత్రలో నటించారు. అలాగే మరి కొన్ని తమిళ చిత్రాలలో నటించారు.ఇక వివాహం అనంతరం విదేశాలకు వెళ్లిన కస్తూరి కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరం అయి తిరిగి వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel