Janaki Kalaganaledu March 25th Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. రామచంద్ర, జానకి లో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి జ్ఞానాంబ ఇంటి ముందు చిన్న గుడిసె వేసుకొని అందులో ఉంటున్నారు. అది చూసిన జ్ఞానాంబ మరింత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. గోవిందరాజు మాత్రం కొడుకు ని శభాష్ అని మెచ్చుకుంటాడు.
అప్పుడు గోవిందరాజు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అనడంతో అమ్మ ను చూడకుండా ఉండలేను కాబట్టి అని అంటాడు రామచంద్ర. దాంతో లోలోపల ప్రేమ ను దాచుకుని పైకి మాత్రం కోపంగా మాట్లాడుతుంది జ్ఞానాంబ. ఇది నా స్థలం ఇక్కడ ఉండే హక్కు నీకు లేదు అని అనడంతో, వెంటనే రామచంద్ర ఇది నానమ్మ నాకు రాసి ఇచ్చిన స్థలం అని అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా సంతోషంగా ఫీల్ అవగా మల్లిక మాత్రం కుల్లుకుంటూ ఉంటుంది.
రామచంద్ర అలా మాట్లాడడంతో జ్ఞానాంబ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎప్పుడు మన అనేవాడివి ఈ రోజు నువ్వు నా అంటున్నావు నీతో ఇలా ఎవరు మాట్లాడిస్తున్నారో నాకు బాగా అర్థం అయ్యింది అంటూ జానకిని మరొకసారి అపార్థం చేసుకుంటుంది జ్ఞానాంబ. అనంతరం జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మల్లికా కూడా కుళ్లు కుంటూ లోపలికి వెళ్తుండగా వెనకాలే గోవిందరాజు మల్లికను వెక్కిరిస్తూ వెళుతూ ఉంటాడు.
![Janaki Kalaganaledu March 25th Today Episode Janaki Kalaganaledu March 25th Today Episode](https://tufan9.com/wp-content/uploads/2022/03/2xwxfK8E.jpg)
మరుసటిరోజు జానకి, రామచంద్ర లు మంచం అల్లుతూ ఉండగా కిటికీ లోంచి చూసిన జ్ఞానాంబ బాధపడుతుంది. వెంటనే కిటికీ డోర్ లను మూసేస్తుంది. మరొకవైపు జానకి రామచంద్ర కోసం ఉప్మా రెడీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రామచంద్ర ఒకవైపు జ్ఞానాంబ ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు. మరోవైపు జానకి కి తన వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది అని బాధపడుతూ ఉంటాడు.
జానకి కూడా రామచంద్ర తన గురించి ఆలోచిస్తున్నాడు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటుంది.ఉప్మా చేస్తున్న సమయంలో జానకి చేయి కాలుతుంది. ఇక జానకి తిన లేకపోయేసరికి ఇప్పుడు రామచంద్ర జానకి కి తినిపిస్తూ ఉంటాడు. ఆ తరువాత జ్ఞానాంబ స్వీట్ షాపు బాధ్యతలు కొడుకు అఖిల్ కు అప్పగిస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Janaki Kalaganaledu: జానకి,రామచంద్ర లను గెంటేసిన జ్ఞానాంబ.. ఆనందంలో మల్లిక..?