Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈరోజు నుంచే రైతన్నల బ్యాంకు అకౌంట్లో రైతుభరోసా డబ్బులు క్రెడిట్ కానున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. తెలంగాణలోని రైతులు జనవరి 26న ఈ స్కీమ్ ప్రారంభించింది.
అప్పటినుంచి రైతన్నలు డబ్బులు ఎప్పుడు పడతాయా అని ఆసక్తిగా ఎదురుచూశారు. నేటి నుంచి ఎకరం సాగు భూములకు సంబంధించి మొత్తం రూ. 17.03 లక్షల రైతుల అకౌంట్లకు రైతు భరోసా డబ్బులు పడనున్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ రైతుభరోసా డబ్బులను పంపిణీ చేయనున్నట్టు చెప్పారు.
Rythu Bharosa : తొలి విడతగా రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం :
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 32 జిల్లాల్లో 563 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు తొలి విడతగా రూ.6 వేల చొప్పున ఒక్కో ఎకరానికి రైతు భరోసా ఆర్థిక సాయాన్ని అందించింది. 9,48,333 ఎకరాల విస్తీర్ణంలో సాగుభూమికి రూ.569 కోట్లను చెల్లించినట్లుగా వెల్లడించింది.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో రైతు భరోసా డబ్బులు ఆగిపోయే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఈ పథకం గత ప్రభుత్వ హయాం నుంచి ఈ స్కీమ్ కొనసాగుతుండటంతో కోడ్ ప్రభావం ఉండదని అధికారులు పేర్కొన్నారు.
ఇప్పటికే 10 వేల ఎకరాలకు పైగా సాగుకు సంబంధించి అనర్హమైన భూములను ప్రభుత్వం గుర్తించింది. ఇకపై, అలాంటి భూములను మినహాయించి మిగిలిన సాగు భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల మంది రైతులకు రైతుభరోసా అందనుంది.
Read Also : Jeera Saunf water : సోంపు, జీలకర్ర పొడితో ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.. ఎప్పుడు, ఎలా తినాలో తెలుసా?
భూమిలేని రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థికసాయం అందించేలా తొలిసారిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి తీసుకొస్తోంది. తొలి రోజున 18,180 రైతు కుటుంబాలకు మొదటి విడతలో భాగంగా రూ.6 వేలు అకౌంట్లలో జమ చేసింది. ఈ పథకానికి సంబంధించి మొదటి రోజునే ఆర్థికశాఖ రూ.10.91 కోట్లను రిలీజ్ చేసింది.