Roja : టాలీవుడ్ లో ఒక పొట్టి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రోజా ఎన్నో సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటిగా మాత్రమే కాకుండా ప్రస్తుతం ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ గా కూడా గుర్తింపు పొందింది. రోజా ఒకవైపు పాలిటిక్స్ మరొకవైపు షూటింగ్లతో నిత్యం బిజీగా ఉంటుంది. ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో కి రోజా గత కొన్ని సంవత్సరాలుగా జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ కామెడీ షో లో వేసే పంచులు ఈ షో సక్సెస్ అవ్వటానికి దోహద పడతాయి అనటంలో సందేహం లేదు.
ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకాదరణ పొంది ఎంతో సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతోంది. ఈ కామెడీ షో కి దీటుగా మరి ఏ కామెడీ షో లేదు. ఇటీవల విడుదల అయిన జబర్దస్త్ షో ప్రోమో లో రోజా కమెడియన్ల పై బాగా సీరియస్ అయ్యింది. ఈ షో లో రోజా అప్పుడప్పుడు ఇట్లు వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటుంది. ఈ తరహాలోనే వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో కూడా రోజా జడ్జీలుగా ఉండటానికి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసింది.
ఈ ఎపిసోడ్ కి అందాల నటి లైలా గెస్ట్ గా విచ్చేసింది. షో కి జడ్జ్ గా ఉండాలో ఆమని, లైలా కి రోజా ట్రైనింగ్ ఇస్తన్నారు. ఈ స్కిట్ లో భాగంగా కెవ్వు కార్తీక్, శాంతి స్వరూప్ స్కిట్ చేస్తూ నువ్ మేకప్ తీస్తే రోజా గారిలా ఉంటావ్ అని కెవ్వు కార్తిక్ శాంతి స్వరూప్ నీ అంటాడు. దీంతో రోజా నవ్వుతున్నామ్ అని ఎలా పడితే అలా మాట్లాడుతావా .. ముగ్గురు జడ్జ్ లను పిలిచినప్పుడు కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి.. అంటూ కెవ్వుకార్తిక్ మీద సీరియస్ అయ్యి వెళ్ళిపోతుంది.
ఇంతలో ఆమని కంగారు పడుతూ ఎంటి మేడం అలా వెళ్ళిపోతున్నారు అని అంటుంది. అప్పుడు రోజా మాట్లాడుతూ మనకి బ్రేక్ కావాలంటే ఇలా చేసి వెళ్లిపోవాలి అని కన్ను కొడుతుంది. దీంతో మిగిలిన ఇద్దరు జడ్జిలు షాక్ అవుతారు. రోజా వేసిన డైలాగ్ కి సెట్ లో ఉన్న వాళ్ళు అందరూ నవ్వుతారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World