...

Upasana: రామ్ చరణ్ ఎంట్రీతో థియేటర్లలో రచ్చ రచ్చ చేసిన ఉపాసన..!

Upaasana: నిన్నటి సాయంత్రం నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్ల వద్ద అభిమానుల మామూలుగా లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా ఈ రోజు రిలీజ్ కావటంతో చాలామంది అభిమానులు నిన్న రాత్రి నుండే థియేటర్ల వద్ద సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతో కాలం నుండి ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఈరోజు సినిమా రిలీజ్ అవ్వటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అభిమానులతో పాటు ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా సినిమా చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈరోజు భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించడంతో ఆ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వీరితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా థియేటర్ కి వెళ్లి ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ చాలా ఎంజాయ్ చేసింది.

థియేటర్లో రామ్ చరణ్ ఎంట్రీ వచ్చినప్పుడు ఉపాసన అభిమానుల మీద పేపర్లు చల్లుతూ నానా రచ్చ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సినిమా చూసిన అభిమానులు సినిమా గురించి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. నార్త్ నుంచి సౌత్ దాకా సినిమా గురించి మంచి పాజిటివ్ టాక్ వస్తోంది.