...

Guppedantha Manasu: మరింత దగ్గరవుతున్న వసు,రిషి.. సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని..?

Guppedantha Manasu : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో గౌతమ్ రిషి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్లో వసుధర కాలేజీ గ్రౌండ్లో కూర్చొని రిషి సార్ నామీద కోపడ్డాడు అని అనుకుంటూ అయినా రిషి సార్ నా మీదే కదా కోప్పడింది. నా రిషి సారే కదా అని సర్ది చెప్పుకుంటూ ఉంటుంది. రిషి సార్ మంచి మంచివాడు రిషి సార్ మనసు వెన్న అంటూ రిషి గురించి గొప్పగా పొగుడుతూ ఉంటుంది. అప్పుడు రిషి తలచుకుని తన నోట్బుక్ లో వి ఆర్ అని రాసి లవ్ సింబల్స్ వేస్తూ ఉంటుంది. ఇంతలోనే రిషి అక్కడికి వచ్చి ఆ నోట్ బుక్ ని లాక్కొని చూస్తూ ఉంటాడు.

ఏంటి మేడం గారికి కోపం వచ్చినట్టు ఉంది అలిగారా అని అనగా నీ మీద నాకు ఎందుకు కోపం ఉంటుంది సార్ అని అనడంతో ఎందుకు ఉండదు అని అనగా మీ కోపం నాకు అలవాటు అయిపోయింది సార్ మీరు తిట్టినా కూడా నేను భరిస్తాను నాకేం బాధ లేదు అని అంటుంది వసుధార. ఆ తర్వాత చెయ్యి పట్టుకొని వసు చేతిలో పెన్నుతో వి ఆర్ అని రాసి లవ్ సింబల్ వేసి కింద జెంటిల్మెన్ అని రాస్తాడు.

అది చూసి వసుధార సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత వారిద్దరూ ఒకరు ఒకరు చూసుకుంటూ చేతులు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు మహేంద్ర వాళ్లు జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి గౌతమ్ వస్తాడు. అప్పుడు మహేంద్ర గౌతమ్ రిషి ఎలా ఉన్నాడు అనడంతో చాలా బాధపడుతున్నాడు అంకుల్ అని అంటాడు గౌతం.

అప్పుడు గౌతమ్ బాధతో ఇలా ఇంకెన్నాళ్లు ఉంటారు అంకుల్ అక్కడ వాడి బాధ ఇక్కడ మీ బాధ చూడలేకపోతున్నాను ఇప్పటికైనా అజ్ఞాతాన్ని వీడి అక్కడికి వచ్చేయండి అని అంటాడు. కానీ మహేంద్ర ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో వెంటనే గౌతమ్ చేతులు జోడించి నేను ఇలా చేయడం తప్ప ఏం చేయలేని అంకుల్ ఇప్పటికైనా మనసు మార్చుకోండి అని అంటాడు. అప్పుడు గౌతం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

మరొకవైపు వసుధర రిషి ఇద్దరు కాలేజీలో మిషన్ ఎడ్యుకేషన్ గురించి రిజల్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే లంచ్ టైం అయింది సర్ వెళ్దామా అని అంటుంది. అప్పుడు నాకు ఆకలిగా లేదు నువ్వు వెళ్ళు వసుధార అనటంతో ఇంతలోనే దేవయాని అక్కడికి రిషి కోసం భోజనం తీసుకుని వస్తుంది. అప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడుతూ ఉంటుంది దేవయాని.

దేవయాని ప్రవర్తన చూసి వసుధర కోపంతో తగిలిపోతూ ఉండగా రిషి మాత్రం నీ గుడ్డిగా నమ్ముతూ ఉంటాడు. అదంతా ప్రేమ కాదు సార్ వట్టి నటనే అది మీకు అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది వసు. దేవయాని వడ్డిస్తూ ఉండడంతో ఈ మేడం ఏదో ప్లాన్ చేసింది అని అనుకుంటూ ఉంటుంది వసు. రిషి మాత్రం తన దేవయాని ప్రేమ చూసి మురిసిపోతూ గొప్పగా మాట్లాడితే ఉంటాడు.

మరొకవైపు మహేంద్ర జగతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా జగతి రిజల్ట్ సమయం దగ్గర పడుతుంది ఇప్పుడు కాలేజీలో ఎక్కువ పని ఉంటుంది. అక్కడ రిషి ఒక్కడే ఒంటరిగా పనులన్నీ చూసుకుంటూ ఉంటాడు అని అనడంతో వెంటనే జగతి మనమే రిషిని ఒంటరిని చేసాము మహేంద్ర అని అంటుంది. అప్పుడు వారిద్దరూ రిషి గురించి తెలుసుకొని బాధపడుతూ ఉంటారు.