Devatha june 30 today episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో కమలా భాష సత్య దగ్గరికి వెళ్లి ఆదిత్యలో మార్పు వచ్చింది మారిపోయాడు అని మాట్లాడుతూ ఉంటారు.
ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగ్యమ్మ స్కూల్లో పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో పిల్లలు రావడంతో వారికి పండ్లు ఇవ్వబోతూ ఉండగా సాయంత్రం తీసుకుంటాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత భాగ్యమ్మ, రాధ నీతో మాట్లాడాలి అని చెప్పి పక్కకు తీసుకొని వెళుతుంది.
అప్పుడు భాగ్యమ్మ మాట్లాడుతూ ఒకరోజు స్కూల్ దగ్గర దేవికి ఆ మాధవ లేనిపోని మాటలు అన్ని చెప్పి రెచ్చగొడుతున్నాడు. ఆరోజు నేను గనుక కళ్ళు తాగి ఉంటే వాడి పని చెప్పే వాడిని అంటూ ఫైర్ అవుతుంది భాగ్యమ్మ. అప్పుడు నువ్వు అలా చేయొద్దు అని అంటుంది రాధ. ఇక అదే రోజు దేవుడమ్మకు మీ ఇద్దరి విషయం గురించి చెప్పాలి అనుకున్నాను అని అనడంతో రాధా షాక్ అవుతుంది.
అలా చెప్పిన నువ్వు ఇక్కడ కూడా ఉండను ఇవ్వకుండా చేస్తావా అని అంటుంది రాధ. దేవుడమ్మ అత్తయ్యకు నిజం చెబితే నన్ను అక్కడ క్షణం కూడా ఉంచదు. అప్పుడు దేవి కూడా పరేషాన్ అవుతుంది. నేను ఆ ఇంటికి వెళ్లితే సత్య ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అనడంతో భాగ్యమ్మ షాక్ అవుతుంది. ఆ తర్వాత బిడ్డ పరిస్థితి తలచుకుని ఎమోషనల్ అవుతుంది భాగ్యమ్మ.
మరొకవైపు స్కూల్లో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు నిర్వహిస్తూ ఉండగా ఆదిత్య, రామ్మూర్తి అలాగే ఒక మహిళా కలెక్టర్ ముఖ్య అతిథులుగా విచ్చేస్తారు. ఈ వేడుకలో భాగంగా దేవి మాట్లాడుతూ నాకు ఇదివరకు చదువుకోవాలి అని ఇంట్రెస్ట్ లేదు కానీ ఆఫీసర్ ని చూసిన తర్వాత నాకు చదువుకోవాలి అని ఇంట్రెస్ట్ పుట్టింది అంటూ ఆదిత్య గురించి గొప్పగా పొగడటంతో ఆదిత్య సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు.
ఆ మాటలు విన్న రాధ కూడా సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత చిన్మయి మాట్లాడుతూ నేను పెద్దయిన తర్వాత ఏమీఅవ్వాలి అని అనుకోవడం లేదు. నేను పెద్దయిన తర్వాత ఒక మంచి అమ్మని అవ్వాలనుకుంటున్నాను అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ తర్వాత చిన్నయి తల్లి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూ రాధా చేసే పనుల గురించి గొప్పగా వివరిస్తుంది.
ఇక రాధ ఆ మాటలకు ఎమోషనల్ అవుతుంది. దూరం నుంచి భాగ్యమ్మ పిల్లల మాటలు విని మురిసిపోతూ ఉంటుంది. రాధ గురించి చిన్న ఈ గొప్పగా చెప్పడంతో ఆదిత్య కూడా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ మాధవ మాత్రం కోపంతో రగిలి పోతూ ఉంటాడు.
Read Also : Devatha june 28 today episode : ఆదిత్య ప్రవర్తనకు బాధపడుతున్న సత్య..మాధవకు గట్టిగా సమాధానం చెప్పిన రాధ..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World