Devatha: ఆదిత్యను హత్తుకున్న రాధ.. కోపంతో రగిలి పోతున్న మాధవ..?

Devatha: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న దేవుత సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో భాగ్యమ్మ గుడిలో ఒకచోట కూర్చుని రుక్మిణీ పడుతున్న బాధల గురించి దేవుడికి చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లి రామ్మూర్తి కుటుంబం అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉండగా అప్పుడు జానకి రేపు మామిడి తోట కి వెళ్ళాలి అని అనడంతో పిల్లలు మేము కూడా వస్తాము అని గోల గోల చేస్తారు. అప్పుడు రాధ మొదటి కోప్పడి తర్వాత సరే అని అంటుంది. అప్పుడు జానకి ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి అని అనటంతో అప్పుడు మాధవ, రాధ ఇక్కడ ఉండకూడదు అని ప్లాన్ వేసింది అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు.

Advertisement

ఆ తరువాత అందరు నిద్ర పోయాక దేవి గతంలో తన ఫ్రెండు లక్ష్మి తల్లిదండ్రులు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా తన తల్లి ప్రవర్తన గురించి కుడా ఆలోచిస్తూ ఉంటుంది దేవి. ఆ తర్వాత సత్య ఊరికి వెళ్లి దేవుడమ్మ కు ఫోన్ చేయగా అప్పుడు దేవుడమ్మ ఆదిత్య గురించి అడగగా ఇంతలో ఆదిత్య అక్కడికి రావటంతో కాస్త తడబడుతుంది.

ఆదిత్య తో కూడా ఫోన్ మాట్లాడిస్తుంది. మరొకవైపు ఆదిత్య కారులో ప్రయాణిస్తూ ఒక చోట తల్లి కూతుర్ని చూసి రాధ, దేవి ఊహించుకుంటాడు. అప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తూ మాధవ ఇంటికి బయలుదేరుతాడు. మరొకవైపు భాష ఈరోజు మా తో పాటు నువ్వు కూడా హాస్పిటల్ కి రావాలి అనడంతో సత్య కూడా సరే అని అంటుంది.

మరోవైపు రాధ వంట చేయడానికి వంట గదిలోకి వెళ్ళేసరికి అక్కడ మాధవ కూరగాయలు కట్ చేసి ఉంచుతాడు. అంతే కాకుండా కాస్త డబల్ మీనింగ్ గా మాట్లాడినట్టు కనిపిస్తాడు. దాంతో మాధవ మాటలు తనకు అసౌకర్యంగా ఉండటం తో అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక అక్కడ కూడా తనమీద ఉన్న ఇష్టాన్ని చెప్పుకుంటూ ఉంటాడు.

Advertisement

అప్పుడే ఆదిత్య ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇక ఆదిత్యను చూసిన రాధ వెంటనే ఎమోషనల్ అవుతూ పెనిమిటి నన్ను ఇక్కడి నుంచి ఎలా అయిన తీసుకెళ్లండి అని హత్తుకుంటుంది. అప్పుడు ఆదిత్య పిల్లల గురించి వచ్చాను అనటంతో మాధవ కాస్త వెటకారంగా మాట్లాడుతాడు.ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel