Weekly Horoscope July 11 to July 17 : వారం రాశిఫలాలు.. ఈ కొత్త వారం ప్రారంభం కాగానే.. మొత్తం 12 రాశుల వారికి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన, సామాజిక జీవితంలో కొత్త మార్పులను చూస్తారు. జూలై 12న, శని మకరరాశిలోకి తిరోగమనం కారణం శని ప్రభావం పడుతుంది. మీ జీవితంలో అనుకోని చిక్కులు, ఆటంకాలను కలిగించవచ్చు. ఈ వారం మీకు ఎలా ఉంటుందో నక్షత్రాల స్థానాల్లో మార్పులు మీకు లాభదాయకంగా ఉంటాయో లేదో లేనిపోని సమస్యలను తెచ్చిపెడతాయో ఇప్పుడు తెలుసుకోండి.

మేషం :
ఈ వారంలో ఫైనాన్స్‌కు సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం సులభతరం అవుతుంది. అందుకే గణేశుడిని పూజించాలి. మీ నైపుణ్యాలతో ఏదైనా మంచి పని చేయవచ్చు. మీకు ఆసక్తి ఉన్న పనులపై కూడా కొంత సమయాన్ని వెచ్చించండి. పుకార్లను పట్టించుకోవద్దు. మీ లోపాలను నియంత్రించుకోండి. మీ బంధాల్లో అపార్థాలు తలెత్తకుండా చూసుకోండి. వ్యాపారపరంగా ఇది సాధారణ సమయమని చెప్పవచ్చు. తప్పుడు ప్రేమ సంబంధాలు, వినోదం మొదలైన వాటితో సమయాన్ని వృథా చేయకండి. ఆరోగ్యం బాగుంటుంది.
వృషభం :
మీరు ఎక్కువ సమయం ఆధ్యాత్మికపరమైన విషయాల్లో గడుపుతారు. మీలో అద్భుతమైన శాంతి కలుగుతుంది. మీ బంధాలను బలోపేతం చేసుకోండి. పెద్దల మార్గదర్శకత్వం, సలహా మీకు సాయంగా వస్తుంది. పుకార్లను ఎక్కువగా పట్టించుకోవద్దు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఈ సమయంలో మీరు రూపొందిస్తున్న విధానాలపై దృష్టి పెట్టండి. వ్యాపారంలో, శ్రమ కారణంగా, సరైన ఫలితాలు సాధించలేరు. సంతోషకరమైన ఇంటి వాతావరణాన్ని నిర్వహించడానికి మీ సహకారం ఎంతైనా అవసరం. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
మిథునం :
ఈ సమయంలో గ్రహాలు అనుకూలమైన స్థితిలో ఉన్నాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక అద్భుతమైన వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ఒకరి తప్పుడు సలహాను పాటించరాదు. మీరు కొత్తవారితో పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో చిన్న, పెద్ద పొరపాట్లు జరగవచ్చు. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రస్తుత పర్యావరణం, కాలుష్యం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.
కర్కాటకం :
మీ వారం సాధారణంగా గడిచిపోతుందని చెప్పవచ్చు. మీరు ఏదైనా పని చేసే ముందు లోతుగా పరిశీలించండి. ప్రభావవంతమైన వ్యక్తి సలహా, సహకారం కష్ట సమయాల్లో కలిసొస్తుంది. సామాజిక సేవా సంస్థల పట్ల సహకార స్ఫూర్తి కూడా పెరుగుతుంది. మీ వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయవద్దు. అది మీకు హాని కలిగిస్తుంది. కోపం, చిరాకును పెంచుకోవద్దు. ప్రస్తుతం వ్యాపార స్థలంలో ఎలాంటి మార్పులు చేయడానికి సరైన సమయం కాదు. మీకు అవసరమైన ప్రతిదాన్ని మీ జీవిత భాగస్వామికి చెప్పండి. వారి నుంచి సరైన సలహా పొందండి. మీ ఆరోగ్యం బాగుంటుంది.
సింహం :
ఈ వారంలో మీరు కొంచెం మెరుగ్గా ఉంటారు. ఇంట్లోని పెద్దల పట్ల సేవాభావాన్ని కలిగి ఉంటారు. వారి మార్గదర్శకత్వాన్ని మీ జీవితంలో పాటించడం ద్వారా ప్రయోజనకరంగా ఉంటుంది. కెరీర్‌కు సంబంధించిన ఏదైనా పని పూర్తయితే చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఈ సమయంలో ఎవరి మాటలు, వదంతులను నమ్మవద్దు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మనశ్శాంతిని అనుభవించడానికి ఏదైనా మతపరమైన కార్యకలాపాలు లేదా ధ్యానం చేయడం చాలా మంచిది. మరోకరి ఆలోచనలతో ఒప్పందాలను కుదర్చుకునే అవకాశం ఉంది. మీకు ఎంత పని ఉన్నా మీరు ఇప్పటికీ ఇంట్లో వ్యక్తులతోనే ఎక్కువగా గడుపుతారు. మీ వాతావరణం మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు.
కన్య :
ఈ సమయంలో మీరు మీ ఆర్థిక స్థితిని, ఇంటి నిర్వహణను నిర్వహించడానికి సాయపడే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు ధర్మ-కర్మ, సామాజిక సేవపై కూడా ఆసక్తి ఉండవచ్చు. ప్రతికూల కార్యకలాపాలు చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తుల్లో సన్నిహిత మిత్రుడు లేదా బంధువులే ఉంటారు. మీ వ్యక్తిగత కార్యకలాపాలతో పాటు మీ పరిసరాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. వ్యాపార వ్యవస్థలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ దినచర్య, ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టండి.
Weekly Horoscope July 11 to July 17 : ఈ వారం రాశిఫలాలు ఏయే రాశులవారికి ఎలా ఉన్నాయంటే?
తుల :
ఈ వారం అలసట ఎక్కువగా ఉంటుంది. అలసట నుంచి ఉపశమనం పొందడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో సమయాన్ని వెచ్చించండి. ఎలాంటి సందిగ్ధతనైనా అధిగమించవచ్చు. కుటుంబ వ్యవస్థలో కూడా కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నించండి. మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. పొరుగువారితో చిన్న విషయానికే వివాదాలు తలెత్తుతాయి. క్లిష్టంగా ఉందని భావించి మీరు వదిలిపెట్టిన వ్యాపారంలో ఆ పనిపై మరోసారి ఆలోచించండి. ఏదైనా పని చేసే ముందు మీ కుటుంబ సభ్యులను సంప్రదించండి. మోకాళ్లు, కీళ్ల నొప్పులు సమస్యను మరింత పెంచుతాయి. ఇష్టమైన భగవంతునికి ఆరాదన చేయడం ద్వారా సమస్యల నుంచి బయటపడే మార్గంగా చెప్పవచ్చు.
వృశ్చికం :
ఇంట్లో.. మీకు సరైన పెళ్లి సంబంధం రావచ్చు. కొత్త వస్తువు లేదా కొత్త కారు కొనుగోలు చేయాలనే ప్లాన్ చేస్తారు. ఇతరుల కన్నా మీ నిర్ణయానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఖర్చులు ఆర్థిక సమస్యలకు దారి తీస్తాయి. కొన్నిసార్లు మీరు మీ ప్రాముఖ్యతను తెలియజెప్పాలని కొన్ని అనవసరమైన విషయాలు కూడా చెబుతారు. మీ అలవాట్లను మార్చుకోండి. వ్యాపారంలో మీ శ్రమకు తగ్గట్టుగా సరైన ఫలితం పొందుతారు. మీరు బిజీగా ఉన్నప్పటికీ.. మీరు మీ కుటుంబంతో కొంత సమయం గడుపుతారు. అధిక శ్రమ, ఒత్తిడి అధిక రక్తపోటుకు కారణం కావచ్చు.
ధనుస్సు :
ఈ వారంలో విధి.. మీకు ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని ఇస్తోంది. మీ నిర్ణయానికి మొదటి స్థానం ఇవ్వండి. ఇతరుల మాటలకు లొంగిపోవద్దు. మీ కృషి, అంకితభావంతో ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. అన్ని బాధ్యతలను మీరే తీసుకునే బదులు పంచుకోవడం నేర్చుకోండి. ఇతరుల సమస్యలపై పనిచేయడం ద్వారా మీ వ్యక్తిగత పనిపై ప్రభావితం కావచ్చు. ఈ సమయంలో పిల్లలకు సరైన మార్గదర్శకత్వం అవసరం. వ్యాపారపరంగా సమయం సాధారణమైనది. దాంపత్యం ఆనందంగా సాగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం :
ఈ వారంలో గ్రహాలు అనుకూలమైన స్థానాల్లో ఉన్నాయి. మీ ప్రత్యేక పని సమాజంలో, కుటుంబంలో ఆనందాన్ని కలిగిస్తుంది. అన్ని కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించడంతోపాటు సమన్వయంతో ముందుకు సాగడం ద్వారా మంచి విజయం లభిస్తుంది. భావోద్వేగానికి గురికావడం ఆరోగ్యానికి మంచిది కాదని గుర్తుంచుకోండి. మీ హృదయంతో కాకుండా మీ మనస్సుతో నిర్ణయాలు తీసుకోండి. ఇంట్లో ఏదైనా నిర్మాణ పనులు జరుగుతుంటే అంతరాయం ఏర్పడవచ్చు. కొన్ని ముఖ్యమైన పనులు కూడా చిక్కులు కలగవచ్చు. మీడియా లేదా ఆన్‌లైన్ కార్యకలాపాలకు సంబంధించిన వ్యాపార కార్యకలాపాలు సజావుగా కొనసాగుతాయి. భార్యాభర్తల బంధంలో మధురానుభూతి ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించండి.
కుంభం :
ఈ వారంలో గ్రహం స్థానం కొద్దిగా మారుతుంది. ఏదైనా ప్లాన్ అమలు చేయడానికి ముందు.. అన్ని స్థాయిల్లో చర్చించండి. అది పెద్ద తప్పు చేయకుండా మిమ్మల్ని నిరోధిస్తుంది. పిల్లల ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా శుభ సమాచారం రావొచ్చు. మీ ప్రవర్తనను ఎప్పటికప్పుడు మార్చుకోవడం అవసరమని గుర్తించండి. ఇతరుల వ్యక్తిగత విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో సమయాన్ని వృథా చేయకూడదు. వ్యాపారంలో తిరోగమనం ఉన్నప్పటికీ.. మీరు కొంత మంచి విజయాన్ని పొందుతారు. మీ ప్రేమ సంబంధాన్ని వివాహంగా మార్చుకోవడానికి కుటుంబ సభ్యులు అనుమతి పొందే సమయం.. మీరు ఆరోగ్యపరంగా జలుబు, జ్వరంతో బాధపడవచ్చు.
మీనం :
ఈ వారంలో అనుభవం కలిగిన వ్యక్తులను కలవడం, మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల మీ ఆలోచనలో సానుకూల మార్పు వస్తుందని చెప్పవచ్చు. మీరు ఏ నిర్ణయమైనా చాలా సులభంగా తీసుకోగలుగుతారు. యువకులు తమ వృత్తి ప్రయత్నాలలో మంచి ఫలితాలను పొందవచ్చు. ఏదైనా సందర్భంలో.. భూమికి సంబంధించిన, డబ్బు లావాదేవీలను చేయవద్దు. ఈ వారంలో మీరు పొరపాటు చేయవచ్చు. తద్వారా రిలేషన్ దెబ్బతింటుంది. పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచడం చాలా ముఖ్యం. చిన్న చిన్న విషయాలే భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతాయి. రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
Read Also : Horoscope : ఈ ఐదు రాశుల వారికి లక్కే లక్కు.. వద్దన్నా డబ్బులు వస్తూనే ఉంటాయి!