Veena-vani : అభివక్త కవలలు అయిన వీణ-వాణిలు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాసులో పాసయ్యారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో వీరిద్దరూ సత్తా చాటారు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ వెంగళ్ రావు నగర్ లోని మహిశా, శిశు సంక్షేమ కార్యాలయంలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారిద్దరూ ఇంటర్ సెకండ్ ఇయర్ లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్ వెల్లడించారు. ఇంటర్ సీఈసీ గ్రూపులో వీణ 712 మార్కులు, వాణి 707 మార్కులు సాధించినట్లు తెలిపారు.
రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ వీణ-వాణిలకు అభినందనలు తెలిపారు వారికి అన్ని విధాలుగా ఇండగా ఉంటున్న అధికారులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీరి ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వారి కలలను సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం సహకారం ఉంటుందని చెప్పారు. అాృలాగే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా వీరిని అభినందించారు. శిశు సంక్షేమ కార్యాలయానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
Read Also : Actress meena : నటి మీనా ఇంట విషాధం.. ఊపిరితిత్తుల సమస్యతో భర్త హఠాన్మరణం!