Cloves Remedy : ఎదుటి వాళ్లు అనుకూలంగా మారాలంటే శత్రు బాధలు తొలగిపోవాలంటే కుటుంబ కలహాలు తొలగిపోవాలంటే లవంగాలకు సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసా? పరిహార శాస్త్రంలో లవంగాలకు ప్రత్యేకమైన పరిహారాలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రపరంగా శనీ, కుజుడు ఈ రెండు గ్రహాల బలం మొత్తం లవంగాల్లోనే ఉంది. అందుకే లవంగాల పరిహారం పాటిస్తే దానివల్ల శత్రుభాదలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. ఎదుటి వాళ్ళ ఏడుపులు తొలగిపోతాయి. ఎదుటివాళ్లు మీకు అనుకూలంగా మారిపోతారు.
లవంగాల పరిహారం శనివారం రోజు చేయాలి. శనివారం రోజున మీ ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసుకుని ఆ తర్వాత పూజగదిలో రాగి పళ్లెం ఉంచి ఆ రాగి పళ్లానికి మూడు రెండు చోట్ల బొట్లు కుంకుమ బొట్లు పెట్టి రెండు పువ్వు ఉన్న లవంగాలను తీసుకోవాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటంటే.. పువ్వు లేని లవంగాలను అసలు ఈ పరిహారంలో వాడొద్దు. ఎందుకంటే.. పువ్వు లేని లవంగాలకు పరిహారం పనిచేయదు.
Cloves Remedy : ఈ లవంగాల పరిహారం ఎలా చేయాలంటే? :
పువ్వు ఉన్న రెండు లవంగాలను తీసుకోండి. నల్ల దారం ఒకటి తీసుకోండి. ఆ నల్లదారానికి పువ్వు ఉన్న లవంగాలను కట్టి ముడిలాగా వేసి ఆ నల్లదారాన్ని రాగి పళ్లెంలో ఉంచండి. ఇష్ట దైవానికి నమస్కారం చేసుకోవాలి. ఈ రెండు లవంగాలు కట్టినటువంటి ఆ నల్ల దారానికి అగరబత్తీలు చూపించి ధూపం వేసి ఆడవాళ్లు లేదా మగవాళ్లు మీ కుడిచేతికి కట్టుకోవాలి. చాలా సులభమైన పరిహారం.. శనివారం మొత్తం ఆ నల్ల దారం మీ చేతికి ఉండాలి.
ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆ నల్లదారాన్ని, పువ్వు ఉన్న లవంగాలను ఎవరూ తొక్కని చోట లేదా ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయాలి. లేదంటే.. వాటిపై కర్పూరం ఉంచి దాన్ని వెలిగించి కాల్చేయాలి. ఇలా చేస్తే మీకున్న శత్రుభాదలన్నీ తొలగిపోతాయి. అందుకే మీరు ఈ నల్ల దారం కట్టుకునే సమయంలో మీరు ఎవరి వాళ్ల శత్రుబాధలను అనుభవిస్తున్నారో వారి పేర్లను చెప్పుకోవాలి. శనివారం ఈ దారం ఉదయం పూట కట్టుకున్నాక రాత్రి పూట ఒక పరిహారం చేయాలి.
శనివారం రాత్రి నాలుగు పువ్వు కలిగిన లవంగాలను తీసుకుని వాటిని నువ్వుల నూనెలో ముంచి కర్పూరం వేసి వెలిగించి కాల్చేయాలి. ఒక్కో దిక్కులో ఒక్కో లవంగం కాల్చాలి. ఒక పళ్లెం తీసుకుని ప్రతి లవంగం నువ్వుల నూనెలో ముంచి కర్పూరం పెట్టి తూర్పువైపు పడమర వైపు ఉత్తరం వైపు దక్షిణం వైపు ఇలా నాలుగు దిశలా ఆ లవంగం వెలిగించి కాల్చేయాలి. ఆ పొగ మొత్తం మీ బెడ్ రూమ్ మొత్తం వ్యాపించాలి. ఈ పరిహారం శనివారం రాత్రి చేయాలి.
Read Also : Astrology Remedy : అనుకున్న పని అనుకున్నట్లు అవ్వాలంటే కుంకమతో ఇలా పరిహారాలు చేయండి.. కష్టాలన్నీ పోతాయి!