Archana: క్యారెక్టక్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా టాలీవుడ్ తో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించి అలరించిన అర్చన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బిగ్ బాస్ సీజన్ వన్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వత హెల్త్ కేర్ వైస్ ప్రెసిడెంట్ జగదీష్ భక్తవత్సలను పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలోని పాల్గొని ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. రాఘవేంద్ర రావు గారితో పని చేయడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. అంతే కాదండోయ్ నటసింహ నందమూరి బాలకృష్ణకు అర్చనే ఓ పాటకు డ్యాన్స్ నేర్పించిందట. బృందావనంలో గోపికలతో డ్యాన్స్ చేసే చిన్న బిట్ కోసం… బాలయ్య బాబుతో స్టెప్పులు వేయించిందట. అందుకు ఆయన బాగా డ్యాన్స్ చేశావని మెచ్చుకున్నారట.
యమదొంగ సినిమాలోనూ ఓ సాంగ్ చేసిందట. తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో మగధీర సినిమాలో ఓ రోల్ కోసం ఆఫర్ వచ్చినా చేయలేదని అర్చన చెప్పుకొచ్చింది. అప్పటి కంటే ఇప్పుడు మెచ్యూరిటీ కాస్త పెరిగిందని వివరించింది. అలాగే పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశం వచ్చి లాస్ట్ మూమెంట్ లో డ్రాప్ అయినవి చాలానే ఉన్నాయంటూ కన్నీళ్లు కూడా పెట్టుకుంది. మీరూ ఓసారి ఈ వీడియో చూసేయండి.