Guppedantha Manasu january 12 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసుధార, రాజీవ్ జైలు బయట మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో రాజీవ్ నీ మెడలో నువ్వే తాళి కట్టుకొని ఎవరో తాళి కట్టారని నన్ని నువ్వు నమ్మిస్తున్నావు. ఎంత తెలివైన దానివి వసు నువ్వు. ఇంత తెలివైనది నాకు భార్యగా వస్తుంది అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని అంటాడు రాజీవ్. ఇప్పుడు జైలు నుంచి వచ్చావ్ నిన్న కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు హాస్పిటల్ కి వెళ్దాం పద అనగా నువ్వు ఎక్కడికి నువ్వు అవసరం లేదు ఇక్కడే ఉండు అని వసుధార ఆటోలో వెళ్లిపోతుంది.
మరొకవైపు రిషి కాలేజీకి వెళ్లి వసుధార జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉండగా ఇంతలో జగతి అక్కడికి వచ్చి జ్ఞాపకాలు అందంగానే ఉంటాయి కానీ అన్ని జ్ఞాపకాలు అందమైన కావు రిషి ఆ జ్ఞాపకాల నుంచి నువ్వు బయటపడాలి అనగా నేనేం తప్పు చేశాను మేడం అతిగా ప్రేమించడమే నేను చేసిన తప్ప ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదు. అప్పుడే నా పసి మనసును అర్థం చేసుకోకుండా మీరు వెళ్లిపోయారు ఎందుకు వెళ్లారు అన్నది నేను అడగలేదు మీరు ఇంతవరకు చెప్పలేదు అని రిషి అక్కడినుంచి వెళ్ళిపోతుండగా ఒక్క నిమిషం రిషి అనడంతో మీరు ఏం చెప్పినా నేను వినను మేడం.
పని మీ శిష్యురాలు కనిపిస్తే ఒకటి చెప్పండి ఈ రిషికీ మోసపోవడం అలవాటే జ్ఞాపకాలతో బతికేస్తాడని చెప్పండి అని చెప్పి అక్కడ నుంచి రిషి వెళ్లిపోతాడు. అప్పుడు జగతి రిషి మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు వసుధార హాస్పిటల్ కి వెళ్లి వాళ్ళ అమ్మ నాన్నలను చూసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. పర్లేదు ఈ పేషంట్ లు ఇద్దరు బాగానే కోలుకున్నారు అని డాక్టర్ అనడంతో డాక్టర్ కి థాంక్స్ చెబుతూ ఉంటుంది.
ఇప్పుడు చక్రపాణి దగ్గరికి వసుధర వెళ్లి నాన్న మీ కూతురు ఎప్పటికీ మిమ్మల్ని తలవంచుకునే పని చేయనివ్వదు అర్థం చేసుకోండి నాన్న అని ఎమోషనల్ అవుతూ ఉండగా సుమిత్ర కు తెలుగు వచ్చి నీళ్లు అడగడంతో నీళ్లు తాగిస్తుంది వసుధార. అరకవైపు జగతి రిషి అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉండగా ఇంతలో మహేంద్ర అక్కడికి వచ్చి ఏటి జగతి ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగా రిషి లోపల మనసుని ముక్కలు చేసుకునే బయటికి మౌనంగా ఆ బాధని అనుభవిస్తూ ఉన్నాడు. మనం ఏమీ చేయలేమా మహేంద్రా రిషి బాధను తీర్చలేమా అని అని జగతి అనడంతో మనం ఏం చేయలేము అని అంటాడు.
ఆరోజు వసుధార ప్రవర్తించిన తీరు నాకు మర్చిపోలేక పోతున్నాను నాకు కోపంగా ఉంది జగతి అని అంటాడు. అప్పుడు వారిద్దరూ రిషి గురించి బాధపడుతూ ఉంటారు. మరొకవైపు వసుధార తన తల్లితో మాట్లాడిన మాటలు గుర్తుతెచ్చుకొని బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి రాజీవ్ వస్తాడు. అత్తయ్య మామయ్యలు బాగానే ఉన్నారు ఇక మన పెళ్లి ఎప్పుడు వసు అనడంతో పిచ్చిపిచ్చిగా వాగకు బావా అని అంటుంది. నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ నుంచి కొట్టేసావా అని రాజీవ్ వసుధర మీదికి చేతులు వేయడానికి ప్రయత్నించగా పక్కకు నెట్టేస్తుంది.
అప్పుడు రిషి గురించి వసు వాళ్ళ అమ్మానాన్నల గురించి నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటాడు రాజీవ్. ఆ తర్వాత మిత్రులకు మెలకువ వస్తుంది. మీ నాన్న ఎక్కడ అనడంతో పక్కనే ఉన్నాడు అమ్మ అని అనగా ఏవండీ అని సుమిత్ర పిలవడంతో చక్రపాణికు కూడా మెలకువ వస్తుంది. మరొకవైపు రిషి తన క్యాబిన్లోకి వెళ్లి వసుధారతో గడిపిన క్షణాలు వసుధార అన్న మాటలే తలుచుకొని బాధపడుతూ ఉంటాడు.
Read Also : Guppedantha Manasu january 11 Today Episode : జగతికి థాంక్స్ చెప్పిన రిషి.. బాధతో కుమిలిపోతున్న జగతి..?