Guppedantha Manasu: వసుని తలుచుకొని బాధపడుతున్న రిషి.. రాజీవ్ చెంప చెల్లుమనిపించిన చక్రపాణి?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి వెళ్లి తన క్యాబిన్లో కూర్చుంటాడు.

ఈరోజు ఎపిసోడ్లో రిషి క్యాబిన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే వసుధార అక్కడికి వచ్చి తనతో మాట్లాడుతున్నట్టుగా ఊహించుకుంటాడు. అప్పుడు వసుధార ఉంది అనుకొని ఇకనుంచి వెళ్ళిపో వసుధారా అని ఫైల్స్ మొత్తం విసిరేస్తాడు. తీరా అక్కడ ఎవరూ లేకపోవడంతో తన భ్రమ అనుకుని బాధపడుతూ ఉంటాడు రిషి. అప్పుడు అక్కడే ఉన్న లవ్ సింబల్ ని చూసి బాధపడుతూ ఉండగా ఇంతలో మహేంద్ర వస్తాడు. అప్పుడు మినిస్టర్ నుంచి ఫోన్ రావడంతో రిషి పట్టించుకోకుండా ఉండగా అప్పుడు మహేంద్ర ఫోన్ ఆన్సర్ చేస్తాడు.

అప్పుడు ఫోన్ కట్ చేసి రిషి దగ్గరికి వెళ్లి మినిస్టర్ గారిపై ఫోన్ చేశారు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి ఇండియా లెవెల్ లో ఒక ప్లాన్ తయారు చేయమన్నారు అని అనగా అవన్నీ జగతి మేడం చూసుకోమని చెప్పండి డాడ్ అని అంటాడు. అప్పుడు మహేంద్ర రిషి చేతిలో ఉన్న ఆ హార్ట్ సింబల్ తీసుకొని పక్కన పెడతాడు. బాధపడొద్దు అని చెప్పను రిసీవ్ కానీ బరువు తగ్గించుకో అని అనగా ఈ బరువు నేను ఎత్తుకున్నది కాదు డాడ్ నాకు వరంగా ఇచ్చిన ఒక శాపం అని అంటాడు రిషి. వసుధార నన్ను మోసం చేసే వేరొకరిని పెళ్లి చేసుకుంది డాడ్ పడుతుండగా మహేంద్ర ఆ వసుధార చేసిన పనిని మర్చిపోలేని రిషి అంటూ బాధపడుతూ తిట్టబోతుండగా వసుధార ఏమీ అనొద్దు అని అంటాడు.

ఏంటి రిషి నువ్వు ఇంకా ఇలానే మాట్లాడుతున్నావా అనగా నాకు కూడా కోపంగా ఉంది కానీ వసుధార ని ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత రిషి కార్లో వెళ్తూ వసుధార, రాజీవ్ అన్న మాటలు తలుచుకుని బాధపడుతూ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఏంటి ఇక్కడికి వచ్చాను అనుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్తాడు. నేను వచ్చాను లేకపోతే నువ్వు నన్ను రప్పించుకున్నావా అమ్మ అని అంటాడు. వసుధార లేకుండా నన్ను చూడాలని నీకు అనిపించిందా, నేను ఏడిస్తే నీకు చూసే సరదా పడాలని ఉందేమో కదమ్మా, అయినా నాకు అమ్మ అన్న పదమే అచ్చు రానట్టుంది అంటూ బాధపడుతూ అమ్మవారికి చెప్పుకుంటూ ఉంటాడు రిషి.

ప్రతిసారి నాకు వసుధారకు కష్టం వచ్చినప్పుడు నీ దగ్గరికి వచ్చి చెప్పుకున్నాము కదా మళ్ళీ ఇలా ఎందుకు చేశావు అని రిషి బాధపడుతూ ఉంటాడు. వసుధార లేకపోయినా కూడా ఒంటరిగా బతుకుతాను అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు హాస్పటల్లో చేస్తే సుమిత్రను ఏం జరిగిందమ్మా చెప్పు అని అనగా చక్రపాణి ఇదంతా మా దురదృష్టం సార్ ఏం చేస్తాము అని అనడంతో కేసుకు సంబంధించిన వివరాలు అన్ని తెలుసుకోవాలి కాబట్టి చెప్పాలి అని అంటాడు. అప్పుడు చక్రపాణి మాట్లాడుతుండగా నువ్వేం మాట్లాడకు బాధితురాలు చెప్పాలి అని సుమిత్రని ప్రశ్నిస్తాడు. అప్పుడు సుమిత్ర మాట్లాడబోతుండగా మధ్యలో రాజీవ్ తన బండారం ఎక్కడ బయటపడుతుందో అని వసుధార రాణి పంపించవద్దు.

సార్ తను జైలుకు వెళితే నేనేం కావాలి తన తల్లిదండ్రులు ఏం కావాలి ప్రాబ్లం ని అర్థం చేసుకోండి అని నాటకాలు వాడుతూ ఉంటాడు. అలా చట్టం ఒప్పుకోదు. నన్ను అరెస్ట్ చేయండి నన్ను ఉరి తీయండి అనడంతో వసుధార నాన్న అనగా నువ్వు మాట్లాడకు వాసు నేను చెప్పినట్టు చేసి ఉంటే ఇదంతా జరిగేదా. సుమిత్ర అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు అని అంటాడు చక్రపాణి. అప్పుడు రాజీవ్ మా అత్త గొప్ప ఇల్లాలు తన కడుపున పుట్టిన కూతురే తనను ఇలా పొడిచిందని ఎలా చెబుతుంది అనడంతో సుమిత్ర షాక్ అవుతుంది. అప్పుడు రాజీవ్ మాటలను పోలీసులు నిజం అని నమ్ముతారు.

అప్పుడు చక్రపాణి రివర్స్ డ్రామా మొదలు పెడుతూ నా అల్లుడు దేవుడిచ్చిన గొప్ప వరం నాకు సార్ ఇలాంటి అల్లుడు దొరకడం నా అదృష్టం అని పొగడ్తలు కురిపిస్తూ ఉండగా ఏంటి మామయ్య గారు మీరు నన్ను పొగుడుతున్నారు అంటూ దగ్గరికి రాగా రాజీవ్ చెంప ఒక్కసారిగా చెల్లుమనిపిస్తాడు. పోలీసులతో పాటు సుమిత్ర వసుధార కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.