Guppedantha Manasu: వసుధార కాళ్ళపై పరీక్షమాపణలు అడిగిన చక్రపాణి.. బాధలో రిషి?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసుధార, ఫోన్ లో రిషి ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార ఫోన్లో రిషి ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటుంది. మరోవైపు క్లాస్ రూమ్ లో కూర్చున్న రిషి వసు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ నన్ను ఇంతలా మాయ చేసి వేరే వాళ్ళతో ఎలా తాళి కట్టించుకున్నావు వసుధార అని బాధపడుతూ ఉంటాడు. ఆరోజు నువ్వు నన్ను ఇందుకైనా కాపాడింది బతికించి క్షణం క్షణం చంపుతున్నావు. నాకు ఏదైనా అయితే నీ ఊపి ఆగిపోతుంది అన్నావు ఇప్పుడు నువ్వే నా ఊపిరి తీస్తున్నావు అని బాధపడుతూ ఉంటాడు రిషి. మరోవైపు వసుధార జ్ఞాపకాలు అన్ని వానజల్లుల మారుతాయి అనుకున్నాను కానీ ఇప్పుడే అవన్నీ వడగండ్ల లా మారుతాయని తెలిసింది అని అనుకుంటూ ఉంటుంది.

Advertisement

ఆ తర్వాత వసుధార చక్రపాణి ఫోన్ నుంచి రిషికి ఫోన్ చేస్తుంది. అప్పుడు రిషి కొత్త నెంబర్ అయినా పర్లేదు లిఫ్ట్ చేద్దామని లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు వసుధార రిషి మాట్లాడే మాటలను తన ఫోన్లో రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఎవరు అన్న రిషి హలో వసుధార అనడంతో వసు ఎమోషనల్ అవుతుంది. అప్పుడు వసు ఫోన్ కట్ చేయడంతో పదేపదే రిషి ఫోన్ చేస్తూనే ఉంటాడు.. ఇప్పుడు వసుధార పక్కనే ఉన్న నర్స్ కి ఫోన్ ఇచ్చి రాంగ్ నెంబర్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత వసుధార బిల్ పే చేయడానికి వెళ్ళగా చక్రపాణి సుమిత్ర అనే పేషంట్ల బిల్లు రిషేంద్రభూషణ్ అనే వ్యక్తి పే చేశాడు అనడంతో వసుధార ఆశ్చర్య పోతుంది.

Advertisement

అప్పుడు చక్రపాణి అక్కడికి వచ్చి రిషి వచ్చాడు నీకు చెప్పడం మర్చిపోయాను అప్పుడే తన మంచితనం గురించి తెలిసింది అని జరిగింది మొత్తం వివరించడంతో వసుధార సంతోషపడుతూ ఉంటుంది. తొందరగా వెళ్లి రిషి ని కలుసుకో అమ్మ అని అంటాడు చక్రపాణి. మరొకవైపు కాలేజీలో కాలేజీ స్టాప్ రిషి వసుధార గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండడంతో ఇంతలో జగతి అక్కడికి వచ్చి వాళ్లపై సీరియస్ అయ్యి వారికి తగిన విధంగా బుద్ధి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలన్నీ రిషి ఆలోచనలో పడతాడు. మరొకవైపు వసుధార వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి ఇంటికి వెళుతుంది. అప్పుడు మొత్తం చల్లా ఎదురుగా ఉండడంతో అది చూసి అందరూ బాధపడుతూ ఉంటారు.

అప్పుడు రాజీవ్ అన్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు చక్రపాణి. ఇప్పుడు వసుధారా నాన్న బాధపడకు నాన్న అనడంతో ఎలా బాధపడకుండా ఉంటావు అమ్మ చెప్పింది చిన్న విషయం కాదు కదా అని రాజీవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ వచ్చి వసుధార కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతాడు. నాన్న ఏంటి నాన్న ఏం చేస్తున్నావ్ నువ్వు ముందు పైకి లేయి అని వసుధార లేపుతుంది. అప్పుడు సుమిత్ర కూడా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు చక్రపాణి, వసుధారని క్షమించమని రెండు చేతులు జోడించి అడుగుతాడు. ఆ తర్వాత సుమిత్ర వసుధారని దగ్గరికి తీసుకుంటాడు. అప్పుడు పక్కనే ఉన్న వాచ్ చూసి వసుధార దాన్ని తీసుకోగా అది అనుకోకుండా తన మంగళసూత్రానికి తగులుకుంటుంది. ఆ తర్వాత రిషి వసుధార పక్కపక్కనే కూర్చుని చీకటి గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఒకరితో ఒకరు మాట్లాడినట్టు ఊహించుకుంటూ ఉంటారు రిషి వసుధార.

Advertisement