Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసుధార, రిషి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్లో వసుధార నేను నష్ట జాతకురాలిని సార్ మిమ్మల్ని బాధ పెట్టాను అనగా వెంటనే రిషి నువ్వు నన్ను బాధ పెట్టావు అంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నువ్వు నన్ను బాధ పెడితే నాకంటే బాధ నీకు ఎక్కువ ఉండాలి కదా ఎందుకంటే నువ్వు నేను వేరు కాదు కదా వసుధార అని అంటాడు రిషి. అప్పుడు వారిద్దరూ ఎమోషనల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం రిషి వసుధార గడిపిన క్షణాలు వసుధార అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉండగా ఇంతలోనే జగతి అక్కడికి కాఫీ తీసుకొని వస్తుంది.
రిషి నువ్వు పెట్టిన మెయిల్ చూశాను రిషి అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుండగా దేవయాని ఎదురుపడి రిషి దగ్గరికి వెళుతుంది. చెప్పు నాన్న రిషి ఏదో మాట్లాడాలి అన్నావు కదా అనగా ఇప్పుడు మన కాలేజీ ఫ్యాకల్టీ ఇంటికి వస్తారు వాళ్లతో మీరు మాట్లాడింది పెద్దమ్మ అనగా, నేనేం మాట్లాడాలి రిషి అని అనడంతో వాళ్ళు వచ్చాక మీకే తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాలేజీ స్టాప్ తో దేవయాని మాట్లాడుతూ ఉంటుంది. మీరు మా కాలేజీలోనే పనిచేస్తూ ఉండి లెక్చరర్స్ అయి ఉండి ఈ విధంగా వసు, రిషి గురించి తప్పుగా మాట్లాడారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనే నాటకాలు వాడుతూ ఉంటుంది.
అప్పుడు దేవయాని ఎంత తిట్టినా వాళ్ళు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. ఏంటో రిషి ఒక్క మాట కూడా అనకుండా అన్ని నాతోనే అనిపిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కాలేజీ స్టాప్ ఈవిడ వసుధారని తిట్టమని చెప్పి ఇలా మాట్లాడుతుంటే ఏంటి అనుకుంటూ ఉంటారు. అప్పుడు దేవయాని వసుధార ని తిట్టమని చెప్పింది నేనే అలాంటిది ఇప్పుడు మళ్లీ నేను వీళ్ళని తిడితే వీళ్ళు నా గురించి చెడుగా అనుకుంటారు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు జగతి వసుధార ఇక్కడ లేదు కదా ఈ డిస్కషన్ అవసరమా అని అనగా, అలా అని కాదు మేడం వసుధార మన కాలేజీలో మరి ఇతర స్టూడెంట్లు బాధపడకూడదు అని వీళ్లకు ఇక్కడికి పిలిపించాను అంటాడు రిషి.
అప్పుడు కాలేజీ స్టాఫ్ రిషి కి స్వారీ చెప్పి ఇంకొకసారి ఎలా చేయకుండా ఉంటాము అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు వసుధార సుమిత్ర చక్రపాణికి భోజనం తినిపిస్తూ గోరుముద్దలు పెడుతూ ఉంటుంది. అప్పుడు జరిగిన విషయాలు తెలుసుకుని చక్రపాణి బాధపడుతూ ఉండగా ఏంటి నాన్న ఇది అనడంతో నా కూతుర్ని అర్థం చేసుకోవడానికి నాకు ఇన్ని రోజులు సమయం పట్టింది అనుకుంటూ ఉంటాడు చక్రపాణి. సరే నీ గదిలోకి వెళ్లి నీ బ్యాగు పక్కన ఒక కవర్ ఉంటుంది దాన్ని తీసుకుని రా అనగా వసుధార కవర్ ని తీసుకుని వస్తుంది.
అప్పుడు ఏది నాన్న ఇది అనడంతో ఇది టికెట్టు నువ్వు రిషి దగ్గరికి వెళ్ళిపో నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావు అది సాధించు. పెళ్లి చేసుకున్నప్పుడు నన్ను మీ అమ్మని పిలు చూచి ప్రేమగా ఆశీర్వాదం ఇస్తాము అని వసుధారకు ధైర్యం చెబుతూ ఉంటాడు చక్రపాణి. మరొకవైపు రిషి ఇల్లు విడిచి వెళ్లిపోవడానికి లగేజ్ తీసుకుని రావడంతో అందరూ షాక్ అవుతారు. ఎక్కడికి వెళ్తున్నావ్ రిషి అనడంతో కొద్దిరోజులు అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను అని అంటాడు.
అప్పుడు పనింద్ర మరి కాలేజీ బాధ్యతలు ఎవరు చూసుకుంటారు అని అడగడంతో ఆ బాధ్యతలన్నీ జగతి మేడం చూసుకుంటారు అనగా దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదేంటి రిషి అనడంతో జగతి మేడంకి ఈ విషయం గురించి ఆల్రెడీ మెయిల్ చేశాను అనగా అప్పుడు దేవయాని మినిస్టర్ సార్ ఒప్పుకుంటాడా అనడంతో మినిస్టర్స్ సారి కూడా మెయిల్ చేశాను సార్ ఓకే అన్నారు బాధ్యతలు మొత్తం జగతి మేడం తీసుకుంటుంది అని అంటాడు రిషి. అప్పుడు వెళ్లడం అవసరమా రిషి అని మహేంద్ర అడగడంతో తప్పనిసరి డాడ్ అని అంటాడు. దాంతో అందరూ బాధపడుతూ ఉంటారు.