Guppedantha Manasu january 17 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్లో రిషి ఇంటి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడతాడు.
ఈరోజు ఎపిసోడ్ లో రిషి నేను అంటే ఎవరో తెలియని ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళిపోతాను మళ్ళీ కొత్తగా పుట్టినట్టు తిరిగి వస్తాను అని అంటాడు. అప్పుడు మహేంద్ర ఎప్పుడు వస్తావు రిషి అనగా ఎప్పుడు వస్తానో తెలియదు అసలు వస్తాను రాను తెలియదు అనడంతో అందరూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు రిషి బయలుదేరగా ఇంతలో జగతి రిషి వెళ్తే వెళ్లావు. నేను నీకు అడ్డు చెప్పను కానీ ఒక్కసారి కాలేజీలో చెప్పి వెళ్లు రిషి అనడంతో ఫణీంద్ర కూడా అవును జగతి చెప్పింది కరెక్టే అనగా రిషి లగేజ్ అక్కడే వదిలిపెట్టి తన గదిలోకి వెళ్లి పోతాడు.

ఆ తర్వాత జగతి రిషి అందరూ కలిసి కాలేజీకి వస్తారు. అప్పుడు రిషి వసుధారతో గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు ఆ తర్వాత మహేంద్ర మీటింగ్ ఏర్పాటు చేసి తొందరగా రా నాన్న అందరు నీకోసం ఎదురు చూస్తున్నారు అనడంతో సరే అని అక్కడికి వెళ్తాడు. ఇప్పుడు మీటింగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన విషయం ఏమీ కాదు. మీటింగ్ ఏర్పాటు చేయడానికి పెద్దగా కారణాలు ఏమీ లేవు. కాలేజీని ఇప్పటివరకు ఎలా అయితే మీ అందరూ సహాయ సహకారాలతో ముందుకు నడిపించారు ఇక ముందు కూడా అలాగే నడిపించాలని కోరుకుంటున్నాను అంటాడు రిషి.
డిబి ఎస్ టి కాలేజ్ కొత్త ఎండి జగతి మేడం అని అనడంతో అందరూ ఒక్కసారి అవుతారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్ అని అనడంతో అది నా పర్సనల్ ఇప్పటివరకు నేను పోరాడి పోరాడి అలసిపోయాను కాస్త విశ్రాంతి కావాలి అని అంటాడు రిషి. ఎండిగా నన్ను ఎలా అయితే గౌరవించి ప్రోత్సహించారో ఇకమీదట కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అని మీటింగ్ ఓవర్ అంటాడు రిషి. ఆ తర్వాత కాలేజీ స్టాప్ అక్కడ నుంచి వెళ్లిపోవడంతో మహేంద్ర ఫణీంద్ర వాళ్లు ఇప్పుడు వెళ్లడం అంత అవసరమారిషి అనడంతో నా మనసుకు గాయం అయింది పెదనాన్న ఆ గాయం అనాలి అంటే కొద్దిరోజులు దూరంగా ఉండాల్సిందే అని అంటాడు రిషి.
ఆ తర్వాత రిషి జగతి దగ్గరికి వెళ్లి జగతి చెయ్యి పట్టుకుని పిలుచుకు వచ్చి తన ఎండి సీట్ లో కూర్చోబెడతాడు. ఆ తర్వాత మహేంద్ర చెయ్యి జగతి చెయ్యి కలిపి డాడ్ జాగ్రత్త మేడం కాలేజీ కూడా జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అందరికీ వెళ్ళొస్తాను అని చెప్పి రిషి వెళ్ళిపోతుండగా ఇంతలోనే వసుధార లగేజ్ తీసుకొని కాలేజీకి వస్తుంది. అప్పుడు రిషి వసుధారనీ చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు వసుధార సార్ అని పిలవడంతో రిషి కారు ఆపుతాడు. అప్పుడు వసుధార అన్న మాటలు గుర్తు తెచ్చుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
తర్వాత జగతి మహీంద్రా వాళ్లు బాధపడుతూ రిషి క్యాబిన్ లో కూర్చొని ఉండగా లోని వసు అక్కడికి రావడంతో ఎందుకు వచ్చావు వసుధార అని అడగగా అదేంటి మేడం అలా అడుగుతున్నారు. మినిస్టర్ గారి నుంచి మెయిల్ వచ్చింది నేను మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఇన్చార్జిగా బాధితులు తీసుకోవడానికి వచ్చాను అని అంటుంది వసుధార. అప్పుడు రిషి బదులు జగతి ఎండి అనడంతో వసుధార షాక్ అవుతుంది.
Read Also : Guppedantha Manasu january 16 Today Episode : జగతిని కాలేజీ హెడ్ గా నియమించిన రిషి.. షాక్ లో దేవయాని?