Karthika Deepam january 18 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో హిమ కార్తీక్ దీప లపై అనుమాన పడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో దీప కార్తీక్, సౌర్యకి భోజనంబుజిస్తూ అత్తయ్యకు నా హెల్త్ కండిషన్ గురించి తెలిసిపోయినట్టు ఉంది అందుకే నాపై చాలా శ్రద్ధ చూపిస్తుంది అనుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి సౌందర్య వస్తుంది. నేను వడ్డిస్తాను అని చెప్పాను కదా దీప ఎందుకు నువ్వు వడ్డిస్తున్నావు అలాగే నేను చెప్పే వరకు నువ్వు వంట గదిలోకి రావద్దు నేను చేసి పెడతాను అని దీపను కూర్చోబెట్టి వడ్డిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి హిమ వస్తుంది. రేపు అందరు కలిసి గుడికి వెళ్దాము అమ్మ నాన్నలు వస్తే ముడుపు కడతానని ముక్కుకున్నాను అనే సౌర్య అనడంతో, నేను రాను మీరు వెళ్ళండి అంటుంది హిమ.

ఎందుకు రావు అని దీప అడగడంతో చిన్న పని ఉంది మీరు వెళ్ళండి అమ్మ అనడంతో నువ్వు రాకపోయినా ఇక్కడ ఎవరూ బాధపడలే అంటుంది శౌర్య. ఆ తర్వాత సౌందర్య వంటగదిలో ఏడుస్తూ ఉండగా దీప అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు అత్తయ్య అనడంతో ఇందాకే తాలింపు వేస్తుంటే పొగ కలలోకి వచ్చింది నువ్వు వెళ్ళు దీపనికి కాఫీ తీసుకొని వస్తాను అనడంతో ముందు మీరు రండి అత్తయ్య కాఫీ మళ్ళీ తాగవచ్చు అని సౌఫా దగ్గరికి పిలుచుకుని వెళ్లి దీప కింద కూర్చుంటుంది. మీకు నిజం తెలిసిపోయింది అన్న విషయం నాకు తెలుసు అత్తయ్య అని అనడంతో ఏం నిజం దీప అనగా నేను ఎక్కువ రోజులు బ్రతకను అత్తయ్య అనడంతో సౌందర్య దీపను పట్టుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
ఆరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలి అనే మాట తీసుకున్నాను కదా అత్తయ్య గుర్తుకు ఉందా అది ఈ విషయం గురించి అత్తయ్య అంటుంది. అప్పుడు దీప నేను ఆఖరి కోరిక కోరతాను అది నెరవేరుస్తారా అత్తయ్య అనగా ఏంటి దీప అనడంతో నా పిల్లలకు తల్లి కావాలి మీ ఇంటికి కోడలు కావాలి అనగా సౌందర్య షాక్ అవుతుంది. మాట్లాడుతున్నావ్ దీప అనగా అవునా అత్తయ్య ఆ మోనిత ఇప్పటికే మిమ్మల్ని వేధిస్తోంది నేను చనిపోయిన తర్వాత నిన్ను డాక్టర్ బాబు పిల్లలని ఇంకా ఇబ్బంది పెడుతుంది అందుకే నా మాట విని డాక్టర్ బాబుకి పెళ్లి చేయండి అలా అని నాకు మాట ఇవ్వండి అని అంటుంది.
దాంతో సౌందర్య కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే సౌర్య అక్కడికి రావడంతో అందరూ కలిసి గుడికి బయలుదేరుతారు. మరొకవైపు మోనిత హిమ కోసం ఎదురు చూస్తూ ఆ హిమను ఎలా అయిన రెచ్చ గొట్టి నా వైపు తిప్పుకోవాలి కార్తీక్ నా మెడలో తాళి కట్టిన చేయాలి అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు దీప కార్తీక్ ఎంత తెలియకూడదు అనుకున్నా తెలిసిపోయింది అనుకొని బాధపడుతూ ఉండగా అప్పుడు అందుకే డాక్టర్ బాబు నేను అత్తయ్యతో మాట్లాడాల్సిందే మాట్లాడాను అనగా నువ్వు పిచ్చి పిచ్చి ప్రపోజల్స్ పెట్టకు దీప అమ్మ గురించి తెలుసు కదా చేసే వరకు వదిలిపెట్టదు అని అంటుండగా ఇంతలో అక్కడికి శౌర్య వస్తుంది.
అప్పుడు వారందరూ కలిసి గుడికి వెళ్తారు. మరొకవైపు హిమా మోనిత దగ్గరికి వెళ్ళగా మోనిత హిమను కావాలనే టెన్షన్ పెడుతూ ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది. నువ్వు చిన్న పిల్లవి హిమ నీకు చెబితే నువ్వు ఆ విషయం తట్టుకోలేవు అనగా అదేంటి ఆంటీ మీరు ఫోన్లో చెప్పలేదని ఇక్కడికి వస్తే ఇప్పుడు అదే మాట చెబుతున్నారు అనడంతో నేను చెప్పేది విను హిమ అని అనగా అసలు ఏం జరిగిందో చెప్పండి ఆంటీ అనడంతో మోనిత అసలు విషయం చెప్పేస్తుంది. సంతోషిమా ఎమోషనల్ అవుతూ ఏం మాట్లాడుతున్నారు ఆంటీ మా అమ్మ చనిపోవడం ఏంటి అనడంతో నిజం హిమ కావాలంటే ఇదే విషయం మీ అమ్మ నన్ను అడుగు చెప్తారు అనడంతో మా అమ్మానాన్నలు అలాంటిది ఏదైనా ఉంటే నాకు చెప్తారు ఆంటీ అనగా, మరి ఎందుకు చెప్పడం లేదు నాకు అర్థం కావడం లేదు.
మీ అమ్మ ఎక్కువ రోజులు బ్రతకదు కానీ మీ అమ్మ ఒకరి వల్ల బతుకుతుంది అది నా వల్లే నేను చెప్పినట్టు వింటే మీ అమ్మ బతుకుతుంది అనడంతో సరే ఆంటీ మీరు చెప్పినట్టు చెప్పి మీరు చెప్పింది చేయమని మా డాడీకి చెప్తాను అని వెళ్ళిపోతుంది. మరొకవైపు శౌర్య నాన్న ఎన్ని రోజులు మీరు ఎక్కడికి వెళ్లారు అనగా ఇప్పుడు వచ్చేసాం కదమ్మ అనడంతో ఎప్పుడు అడిగినా ఇలాగే చెప్తారు అనగా సరే నాన్న ఇంకెప్పుడు మా దగ్గర నుంచి వెళ్ళను అని మాట ఇవ్వండి అనడంతో మేము ఎక్కడికి వెళ్ళను సౌర్య మీ అమ్మ ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అనడంతో సరే అని ముడుపు కట్టడానికి వెళుతుంది సౌర్య. మరొకవైపు దీప తన పరిస్థితి గుడిలో పూజారితో చెప్పుకొని ఎక్కడైతే జీవితాన్ని మొదలు పెట్టానో తిరిగి మరి అక్కడికి వచ్చి ముగించుకుంటున్నాను అని ఏడుస్తూ ఉంటుంది. ఆ దేవుడిని నాకు ఇంకా కొంచెం ఆయషు ఇవ్వమని చెప్పండి పూజారి గారు అని ఏడుస్తూ ఉంటుంది దీప.
Read Also : Karthika Deepam january 17 Today Episode : దీప పరిస్థితి తలుచుకొని మిగిలిపోతున్న సౌందర్య.. సరికొత్త ప్లాన్ వేసిన మోనిత?