Guppedantha Manasu january 11 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసుధార జైల్లో రిషిధార అని పేరును చూసి బాధపడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో జగతి, మహేంద్ర, దేవయాని ధరణి రిషి కోసం ఎదురు చూస్తూ బాధపడుతూ ఉండగా అప్పుడు దేవయాని ఎప్పుడు నేను పెత్తనాలు చేస్తానని మీరందరూ అంటూ ఉంటారు కదా అలా పెద్దరికం చేయడం అందరికీ రాదు. మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు లాభనష్టాలు ముందు వెనుక ఆలోచించి చేయాలి తగులు అమ్మ అని అక్కడికి వెళ్లారు. నన్ను కాదనుకొని నాకు చెప్పకుండా వెళ్లారు. తీరా ఏం చేశారు? రిషి ని బాధపెట్టాను అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుందని. ఒకవేళ ఆ సమయంలో నేను అక్కడ ఉండి ఉంటే బ్రతిమాలో, నచ్చచెప్పి వసుధార నాన్నతో మాట్లాడి రిషి,వసుధార ల వల్ల పెళ్లి చేసేదాన్ని అంటూ నాటకాలు ఆడుతూ ఉంటుంది దేవయాని.

అప్పుడు అందరూ జగతి మహేంద్ర దేవయాని మాటలకు ఏం మాట్లాడకుండా మౌనంగా బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే రిషి రావడంతో అందరూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు దేవయాని నాటకాలు వాడుతూ వచ్చావా నాన్న రిషి ఎక్కడికి వెళ్లావు ఏం చేస్తున్నావు అని చాలా భయపడ్డాను ఈ అవతారం ఏంటిది ఏంటి ఇలా అయిపోయావు అని అంటుంది. అప్పుడు రిషి అక్కడినుంచి వెళ్ళిపోతుండగా ఆగు రిషి అని అంటాడు మహేంద్ర. అప్పుడు ఎక్కడ ఉన్నావు రిషి అనగా ఇంకా ఉన్నాను కదా డాడ్ అని అంటాడు.
అప్పుడు జగతి మాట్లాడే ప్రయత్నం చేయగా ఇంకేం చెప్పొద్దు మేడం అని అంటారు. నాకు చిన్నప్పటినుంచి ఇలా జరుగుతూనే ఉంది. మొదట చిన్నప్పుడు ఒకరు మోసం చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత సాక్షి ఇప్పుడు ఏమో వసుధార ఇలా నాకే ఎందుకు జరుగుతుంది అని బాధగా మాట్లాడుతాడు రిషి. మీరు మీ శిష్యురాలిని కాలేజీకి తీసుకొని వచ్చినప్పుడు నా లైఫ్ లోకి పరిచయం చేసినప్పుడు మీకు నేను మనసులో థాంక్స్ చెప్పుకున్నాను. ఇప్పుడు కూడా థాంక్స్ చెప్పాలా మేడం అనగా జగతి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. వసుధార నాకు గుణపాటాన్ని నేర్పింది చాలా థాంక్స్ మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు వసుధార జరిగిన విషయాలు తలచుకొని బాధపడుతూ ఉంటుంది.

ఆ తర్వాత రిషి ఇంట్లో కింద నేలపై పడుకుని వసుధార అన్నమాట తలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తరువాత వసుధార ఇచ్చిన కర్చీఫ్ నెమలి ఈక అవన్నీ చూసి బాధపడుతూ ఉంటాడు రిషి. అప్పుడు వాటిని బయటకు విసిరేయడానికి వెళ్ళగా వసుధార గుర్తుకు రావడంతో వాటిని విసిరేయకుండా తన దగ్గరే దాచుకొని వాటిని చూసి బాధపడుతూ ఉంటాడు. తరువాత మరుసటి రోజు ఉదయం జగతి దంపతులను చూసి కావాలనే వెటకారంగా మాట్లాడిస్తూ ఉంటుంది. అప్పుడు రిషి కోసం దేవయాని కాఫీ తీసుకొని వెళుతుండగా మహేంద్ర అడ్డుపడి తాను కాఫీ తీసుకొని వెళ్తాడు. రిషి గదిలోకి వెళ్లి చూడగా అక్కడ రిషి కింద పడుకొని ఉండడంతో మహేంద్ర బాధపడుతూ ఉంటాడు.
అప్పుడు రిషి నేను నిద్ర లేపి ఏంటి నాన్న ఇలా పడుకున్నావు అనగా మహేంద్ర ఒడిలో తల పెట్టుకుని తన బాధలు చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు రిషి. ఇందులో జగతి అక్కడికి వచ్చి వారి మాటలు విని బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు దేవయానికి రాజీవ్ ఫోన్ చేసి వసుని విడిపించమని అడగగా నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళు నీకే అర్థమవుతుంది అని అంటుంది. మరొకవైపు పోలీస్ స్టేషన్లో దేవయాని పంపించిన లాయర్ వసుని విడిపిస్తాడు. అప్పుడు దేవయాని పోలీస్ తో మాట్లాడుతూ తను మా మనిషి వదిలేయండి అని అనగా సరే మేడం మీ పూచి కత్తు మీద వదిలేస్తున్నాను అని అంటాడు. ఇంతలో రాజీవ్ అక్కడికి వచ్చి వసుధార బయటకు పిలుచుకుని వెళ్తాడు. వెళ్దాం పద వసు అనడంతో ఎక్కడికి అని అడగక మీ అమ్మానాన్న దగ్గరికి వెళ్లి మనం పెళ్లి చేసుకుని వాళ్ళని సంతోషంగా చూసుకుందామని అంటాడు. నాకు ఆల్రెడీ పెళ్లయిందని చెప్పాను కదా అనగా నీకు పెళ్లి అవ్వలేదు నాకు తెలుసు. నీకు నువ్వుగా తాళి కట్టుకొని అబద్ధాలు చెప్పావు ఇలాంటి తెలివైన పెళ్ళాం నాకు పెళ్ళాం గా దొరకడం ఇష్టం అని అంటారు రాజీవ్.
- Guppedantha Manasu june 2 Today Episode : రిషి గురించి బాధ పడుతున్న జగతి దంపతులు..వసుకి ఫోన్ చేసిన రిషి..?
- Guppedantha Manasu Oct 29 Today Episode : రిషి,మహేంద్రను ఒకటి చేయాలి అనుకుంటున్న వసు.. ఇంటికి వెళ్ళిపోదాం అంటున్న జగతి..?
- Guppedantha Manasu Aug 26 Today Episode : రిషికి ప్రామిస్ చేసిన వసుధార..రిషి కౌగిట్లో వసు…?















