Guppedantha Manasu Aug 25 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జగతి స్పీచ్ ఇస్తూ ఉంటుంది. ఈ రోజు ఎపిసోడ్ లో జగతి,వసుని మాట్లాడమని చెప్పి స్టేజ్ మీదకు పిలుస్తుంది. అప్పుడు వసుధార స్టేజి పైకి ఎక్కి విద్యార్థుల గురించి మధ్య మధ్యలో రిషి ని ఉద్దేశించి మాట్లాడుతుంది. అందరికీ ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం వెళ్ళలేను ఏమో అని భయంగా ఉంది అంటుంది. ఈ కాలేజీలో నా జర్నీ గురించి చెప్పుకోవడానికి సమయం సరిపోదు.

ముఖ్యంగా నేను ముగ్గురికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఒకరు నన్ను ఇక్కడ చేర్పించిన వారు,ఇంకొకరు నన్ను చూసుకున్న వారు, మరొకరు నేను వసుధార అని నాకు గుర్తు చేసిన వారు. వారే జగతి మేడం, మహేంద్ర సార్,రిషి సార్ థాంక్యూ సో మచ్ అంటూ ఎమోషనల్ అవుతుంది. వెంటనే జగతి వెళ్లి వసు ని దగ్గరికి పిలుచుకొని ఓదారుస్తుంది.
ఆ తరువాత రిషి కార్లో వెళ్తూ ఉండగా ఒకచోట వసుధార ఓడిపోయి ఒంటరిగా నిల్చొని ఉండడంతో రిషి కారు ఆపి అక్కడికి వెళ్తాడు. ఏంటి వసు ఇక్కడ ఉన్నావు అని అడగగా చిన్న పని ఉంది సార్ అని ఉంటుంది. అప్పుడు వర్షం పడేలా ఉంది వెళ్లి కార్లో కూర్చుని మాట్లాడదాం పద అని అనగా,కారులో కూర్చుని మాట్లాడే మాటలు కాదు సార్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమో అని అంటుంది.
Guppedantha Manasu Aug 25 Today Episode : ట్విస్ట్ అదిరిందిగా.. రిషికి మనసులో మాట చెప్పేసిన వసు..
అప్పుడు రిషి వర్షం పడేలా ఉంది అని అనగా నా మనసులో తుఫాను వస్తుంది సార్ అని అంటుంది వసు. అప్పుడు వసుధార తన బ్యాగులో ఉన్న గిఫ్ట్ ని బయటకు తీసి చూపించడంతో మళ్లీ ఎందుకు తెచ్చావు వసుధార అని అడగగా అప్పుడు వసు ఎమోషనల్ గా కొన్ని భారీ డైలాగులు చెబుతుంది. నాకు మీరు కావాలి సార్, జీవితాంతం కావాలి.
అప్పుడు నేను మిమ్మల్ని వద్దనుకున్నాను కానీ మీ కన్నా నేనే ఎక్కువ బాధపడుతున్నాను. అని అనడంతో రిషి ఒకవైపు ఆశ్చర్యంగా మరొకవైపు సంతోషంగా చూస్తూ ఉంటారు. వసు మాటలు అర్థం కాక రిషి షాక్ లో ఉంటాడు. అప్పుడు ప్రేమ లేదన్నావు ఇప్పుడు ప్రేమ అంటున్నావు అసలు ఏంటిది వసు అని అనగా, ఒక రోజు మీకు చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఎంత అల్లాడిపోయాను.
ఆ తర్వాత ల్యాబ్ లో మీ ప్రాణాలు కాపాడడానికి నా ప్రాణాలు కోల్పోయిన కూడా పర్వాలేదు అనుకున్నాను. ఇదంతా ప్రేమ కాదా సార్ నాకు మిమ్మల్ని కోల్పోవాలని లేదు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు నా ప్రేమ ను స్వీకరించండి అని చెప్పి రిషికి ఆ గిఫ్ట్ ఇస్తుంది. అప్పుడు రిషి వసుధార వైపు సంతోషంగా చూస్తూ ఉంటాడు.