Horoscope : ఈరోజు అనగా సెప్టెంబర్ 23వ తేదీ శుక్రవారం నాడు పన్నెండు రాశుల వాళ్ల రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. మఖ్యంగా ప్రధాన గ్రహాలు అయిన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల రెండు రాశుల వాళ్లకు ఈరోజంతా అస్సలే బాలేదని తెలిపారు. అయితే ఈ రెండు రాశులు ఏంటి, వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి.. మేష రాశి వాళ్లు తలపెట్టిన కార్యాలకు ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఎవరినీ కదపకండి. వారిని కదిపి లేనిపోని మాటలు పడి మనసు పాడు చేసుకోకండి. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. జాగ్రత్తగా వ్యవహరిస్తే తప్ప సమస్యల నుంచి తప్పించుకోలేరు. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది.
సింహ రాశి.. సింహ రాశి వాళ్లు చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. కాబట్టి ఈరోజంతా పని చేసీ చేసీ మీ ఒళ్లు హూనం అవడం ఖాయం. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. అనవసరంగా నోరు జారారంటే ఇక మీ పని అంతే. లేనిపోని సమస్యల్లో ఇరుక్కున్నట్లే. కాబట్టి బంధువులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆపదలు తొలగడానికి శ్రీరామ రక్షా స్తోత్రం చదివితే మంచిది.