Sreeja konidela: తెలుగు ప్రేక్షకులకు కొణిదెల శ్రీజ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చిరంజీవి కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీజ పలు మెగా ఈవెంట్ లలో పాల్గొని తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకుంది. ఇక గతంలో కొన్ని వ్యక్తిగత విషయాల్లో చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇక కొంత కాలం క్రితం హీరో కళ్యాణ్ దేవ్ ని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
మెగా డాటర్ శ్రీజ కొణిదెల ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఆమె వ్యక్తిగత జీవితంపై నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది. ఇటీవలే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళ్లిన శ్రీజ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లైఫ్ లో జరిగిన విషయాలను షేర్ చేసుకుంటుంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్టును షేర్ చేసింది.
నా కష్ట సుఖాల్లో నాకు తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. నేను కోపంలో ఉన్నప్పుడు నవ్వించారు. ఏడుస్తున్నప్పుడు భుజం తట్టారు. నేను మాట్లాడినప్పుడు విన్నారు. నేను ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు. నాకు కొండంత అండగా నిలబడ్డారు. ఇలాంటి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దొరికినందుకు ఎంతో లక్కీగా ఫీల్ అవుతున్నా అంటూ శ్రీజ పేర్కొంది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.