...

Viral Video: పెళ్లి బరాత్ కోసం రోడ్డు పైకి కదిలి వెళ్ళిన మంటపం… ఇండియన్స్ ఐడియాకి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్!

Viral Video: వేసవి కాలం కావడంతో దేశమంతా ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఎండ తీవ్రత అధికమవుతూ ఇంటి నుంచి కాలు బయటకు పెట్టి లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే వేసవి కాలం లోనే పెళ్లి ముహూర్తాలు అధికంగా ఉండటం చేత ఎక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు కూడా జరుగుతున్నాయి. వేసవి తాపం తట్టుకొని పెళ్లిలో ఎంజాయ్ చేయాలని సూరత్ లోని ఓ పెళ్లి బృందం వినూత్న పద్ధతిని ఆలోచించారు. ఈ క్రమంలోనే వీరి ఐడియా చూసిన ఎంతో మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఈ పెళ్లి బృందం వారు పెళ్లిలో బారాత్ కోసం పెళ్లి కుమారుడిని గుర్రంపై ఊరేగింపుగా తీసుకు వెళ్తూ అతని బంధువులు అందరూ రోడ్డుపై డాన్స్ చేస్తూ వెళ్తున్నారు. అయితే ఎండలు అధికంగా ఉండటంతో ఈ పెళ్లి బృందం వారు కదిలే పందిరిని ఏర్పాటు చేశారు.ఈ పందిరిని నలుగురు నాలుగు వైపులా మోసుకుని తీసుకెళ్తుండగా దానికింద వరుడు గుర్రంపై ఊరేగింపుగా వెళ్తూ ఉండగా మిగిలిన బంధువులు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోని రిటైర్డ్ ఎయిర్ మార్ష‌ల్ అనిల్ చోప్రా ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఇండియన్ క్రియేటివిటీ అంటే ఇదే కదా… ఇండియన్స్ ఆలోచనలకు ఎంతో మంది నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇలా పెళ్లి కోసం రోడ్డుపైకి పెళ్లి పందిరి కదలి రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.