Zodiac Signs : మే నెల 2022లో కర్కాటక రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, శుక్ర, రాహు, కేతు గ్రహాల సంచారం వల్ల మే 18వ తేదీ తర్వాత ధన లాభాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకి చాలా మంచి సమయం. అనేక రకాల లాభాలతో పాటు పేరు, ప్రతిష్టలు కూడా వస్తాయి. అదే విధంగా కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటారు. వీటి వల్ల చాలా లాభాలు వస్తాయి. అదే విధంగా సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్న వాళ్లకి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది.
కళలు.. వార్తా, యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్లకి చక్కటి కాలం అని చెప్పుకోవచ్చు. అలాగే హోం లోన్స్, వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్స్ కోసం ప్రయత్నించే వారికి లోన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకు ఈ నెలంతా సరిగ్గా లేదు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా కష్టపడి చదివితే తప్ప మంచి మార్కులు సంపాదించ లేరు. అంతే కాకుండా కష్టపడి చదివితేనే పస్టు క్లాసులో పాసవుతారు. వివాహ ప్రయత్నాలు చేసే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని సంబంధం కలుపుకోవాలి. ముఖ్యంగా మధ్య వర్తిత్వం మంచిది కాదు.