September 21, 2024

Wife Image: భార్య ఫోటోని వాటాప్స్ డీపీగా పెడుతున్నారా… భర్తలు జాగ్రత్త!

1 min read
pjimage 2022 05 06T191143.514

Wife Image: చాలా మంది భర్తలు తమ భార్యలపై ఉన్న అభిమానంతో ఫేస్ బుక్, వాట్సాప్ లలో తన భార్య ఫోటోలను ప్రొఫైల్ ఫోటో పెడుతూ ఉంటారు. ఇలా భార్య ఫోటోను ప్రొఫైల్ ఫోటోగా పెట్టే భర్తలకు హెచ్చరిక. ఈ విధంగా భార్య ఫోటో ప్రొఫైల్ ఫోటో పెట్టే వారిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…చెన్నైలోని అయ్యన్నవరం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తనను ఓ అగంతకుడు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన చోటుచేసుకుంది.

pjimage 2022 05 06T191143.514సదరు వ్యక్తి తన భార్య ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో గా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే కొందరు సైబర్ నేరగాళ్లు ప్రొఫైల్ ఫోటోలు సేవ్ చేసుకొని తన భార్య ఫోటోనే మార్ఫింగ్ చేసి నగ్న ఫోటోగా మార్చేశారు. ఈ క్రమంలోనే ఆ ఫోటోని ఆ భర్తకు పంపించి తనని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు.ఈ క్రమంలో తను అడిగిన డబ్బు చెల్లించకపోతే తన భార్య నగ్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించసాగాడు.

ఈ క్రమంలోనే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ వ్యక్తి స్థానిక పోలీసులను సంప్రదించి అసలు విషయం తెలియజేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేరస్తుడిని తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇలా సైబర్ నేరగాళ్లు మరి డబ్బు కోసం దారుణంగా ప్రవర్తిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే వాట్సప్ ప్రొఫైల్ పెట్టుకోవాలి అనుకునేవారు సెట్టింగ్ లోకి వెళ్లి కేవలం మనకు కావలసిన వారు మన ప్రొఫైల్ ఫోటో చూసే విధంగా సెట్ చేసుకోవడంతో ఇలాంటి సమస్యలు ఉండవు.లేకపోతే తమ భార్య ప్రొఫైల్ ఫోటోలను పెట్టకుండా ఉండటం ఇంకా మంచిది.