Viral News: అమ్మాకానికి అమ్మాయి ఐఫోన్, ఎందుకంత ఎక్కువ ధర?

Viral News: ఆపిల్ ఐఫోన్ తన కొత్త మాడల్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ కొనుగోలు చేసేందుకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పోటీ పడుతున్నారు. చాలా మంది ఐఫోన్ 14 కోసం తమ వద్ద ఉన్న పాత ఐఫోన్లను విక్రయానికి పెట్టి, వచ్చిన డబ్బుకు మరికొంత సేవ్ చేసుకున్న డబ్బును కలుపుతున్నారు. ఓ మోడల్ కూడా ఐఫోన్ 14 కొనుగోలు చేయాలని భావించింది. ఇందుకోసం తమ వద్దనున్న పాత ఫోన్ ను విక్రయానికి పెట్టింది. ఆమె తన ఫోన్ తో పాటు మరో బంపర్ ఆఫర్ కూడా ప్రకటించింది. ఆ ఆఫర్ విని చాలా ఆమె ఫోన్ ను కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. అయితే ఆ మోడల్ నిర్ణయంతో 20 ఐ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

థాయ్ లాండ్ కు చెందిన 26 ఏళ్ల మోడల్ కనోక్యదా తన ఐఫోన్ 12 ప్రో మాక్స్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన ఫోన్ విక్రయించాలనుకుంటున్నట్లు ప్రకటించింది. ఆమె అలా పెట్టడమే ఆలస్యం, చాలా మంది పోటీ పడుతున్నారు. ఎందుకంటే ఆ ఫోన్ ను కొనుగోలు చేసిన వారికి, ఫోన్ తో పాటు అందులో ఉన్న ఫొటోలు, వీడియో క్లిప్ కూడా ఫ్రీగా లభిస్తాయి. అందుకే ఈ ఫోన్ కు విపరీతమైన క్రేజ్. అయితే తన మొబైల్ లో ఉన్న ఫొటోలు, వీడియోలను అస్సలే తొలగించనని చెప్పింది. ఆమె ఫోన్ లో దాదాపు 30 వేల ఫొటోలు, 4 వేల వీడియోలు ఉన్నాయట.