Naga chaitanya : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ నాగ చైతన్య, సమంతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎన్నో ఏళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నామని చెప్పి అందరినీ షాక్ కు గురి చేశారు. విడాకుల తర్వాత నుంచి వీరికి సంబంధించిన చిన్న వార్త కూడా హైలెట్ గా నిలుస్తోంది.
వారిద్దరిలో ఎవరు ఏం మాట్లాడినా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే నాగ చైతన్య తామిద్దరం గౌరవంగానే విడిపోయినట్లు తెలిపారు. మేం చెప్పాల్సింది చెప్పామని పేర్కొన్నారు. కానీ సామ్ మాత్రం నోరు విప్పలేదు. కాఫీ విత్ కరణ్ షోలో మాత్రం చై గురించి పలు ఆసక్తికర కామెంట్లు చేసింది.
అయితే తాజాగా నాగార్జున బ్రహ్మాస్త్ర సక్సెక్ సందర్భంగా ముంబై వెళ్లారు. అక్కడ చై, సామ్ విడాకుల గురించి నాగ్ కు ప్రశ్న ఎదురైంది. నాగ చైతన్య సినిమాల కంటే అతని వ్యక్తిగత జీవితంపై చర్చ జరగడం అనేది తండ్రిగా మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తోందా అని అడిగారు. ఇందుకు నాగ్.. చై హ్యాపీగా ఉన్నాడు. నేను దాన్ని చూస్తున్నాను. నాకది చాలు. ఇప్పుడు మేం చై విడాకుల గురించి ఆలోచించట్లేదు. తమ జీవితాల్లోంచి అది వెళ్లిపోయింది. అందరి జీవితాల్లోనుంచి వెళ్లిపోతుందని ఆశిస్తామంటూ కామెంట్లు చేసారు. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి.
Read Also : Naga Chaitanya -Samantha: భవిష్యత్తులో సమంతతో కలిసి నటిస్తారా.. షాకింగ్ సమాధానం చెప్పిన చైతన్య?