Yashoda Teaser Review : సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న యశోద సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. హరి-హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్న ఈ సినిమాని శ్రీదేవి మూవీస్’ పతాకం పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హింది భాషలలో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. గతంలో ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ గ్లిమ్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమా టీజర్ చూసిన ప్రేక్షకులకు ఈ సినిమా సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సమంత యశోద పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాలో సమంత గర్భవతిగా ప్రేక్షకులముందుకు రానుంది. ఇటీవల విడుదలై టీజర్ లో గర్భం దాల్చిన సమంత కి డాక్టర్ జాగ్రత్తలు చెబుతూ మొదటి మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నప్పుడు ఆమె కడుపులో శిశివుకి ప్రమాదం జరిగినట్టు చూపించారు. ఆ తర్వాత టైంకి నిద్రపోవాలి అని డాక్టర్ చెబుతుంటే అసలు ఆమెకు నిద్రపట్టకుండా ఉన్నట్టు టీజర్ లో చూపించారు.
Yashoda Teaser Review : సామ్ యశోద టీజర్ ఎలా ఉందంటే?
ఇక బరువులు మోయకుండ జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటే సమంత మాత్రం జిమ్ లో బరువులు ఎత్తినట్టు చూపించారు. ఇక డాక్టర్ జాగ్రత్తగా నడవాలి అని చెబుతుంటే ఆమెను కుక్కలు వెంటాడుతుంటే అడవిలో పరిగెత్తినట్టు చూపించారు. అంతే కాకుండా ఈ టీజర్ లో గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా సమంతని ఎవరో కిరాతకంగా కొడుతున్నట్టు కూడా చూపించారు. గర్భవతిగా ఉన్న యశోద ఇన్ని ఆటంకాలు ఎదురులేని ఆమె బిడ్డని కాపాడుకోగలుగుతుందా? లేదా ? అన్న సస్పెన్స్ ని క్రియేట్ చేసి టీజర్ రిలీజ్ చేసారు. ఇక ఈ టీజర్ చూస్తుంటే ఈ సినిమా ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండనున్నట్లు తెలుస్తొంది. ఈ టీజర్ తో సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World