...

Health Tips: సైజులో చిన్నగా ఉన్నా… మల్బరీ పండ్లలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Health Tips: ఆరోగ్యాన్ని కాపాడతాయి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎంతో దోహదపడతాయి. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పండ్లను కూడా చేర్చుకోవటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో మల్బరీ పండ్లు ఉన్నాయి. మల్బరీ పండ్లు చూడటానికి చిన్న సైజులో ఉన్నా.. వాటిలో ఎన్నో పోషకవిలువలు దాగి ఉన్నాయి. మల్బరీ పండ్లను రోజువారీ ఆహారంలో తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుతుంది. మల్బరీ పండ్లు వల్ల కలిగే ఉపయోగాలు గురించి తెలుసుకుందాం.

మల్బరీ పండ్లలో ఐరన్,క్యాల్షియం, జింక్, ప్రోటీన్, ఫైబర్ మరియు ఎన్నో రకాల విటమిన్స్ కూడా ఉంటాయి. అందుకే ఈ పండ్లు రోజువారి ఆహారంలో తీసుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి అని డాక్టర్లు సూచిస్తున్నారు.

• మల్బరీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి రోగాలు దరిచేరకుండా కాపాడుతుంది.
• అంతేకాకుండా మల్బరీ పండ్లలో క్యాల్షియం ఐరన్ ఎక్కువగా ఉండటం దంతాలు , ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తాయి.
• డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు కూడా మితంగా ఈ పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తుంది.
• క్యాన్సర్, కిడ్నీ సమస్యలు కూడా రాకుండా కాపాడుతాయి. అధిక రక్తపోటు సమస్యను కూడా అదుపు చేస్తాయి.
• మల్బరీ పండ్లలో విటమిన్ ఎ ఉండటంవల్ల కంటి చూపు సమస్యతో బాధపడేవారికి కూడా ఈ పండ్లు బాగా ఉపయోగపడతాయి.