Tamanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమన్నా పేరు వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది ఆమె అందం. తమన్నా గ్లామర్ కు యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే. తమన్నా సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ షేర్ చేసింది అంటే కుర్రకారు ఫిదా కావాల్సిందే. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఆ తమన్నా తన రూటే మార్చేసింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం నటన మీద కంటే స్పెషల్ సాంగ్స్ అలాగే వీడియో సాంగ్స్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Tamanna
ఇక తమన్నా డాన్స్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ పాప్ సింగర్ తో కలిసి తమన్నా డాన్స్ వేస్తే అది వేరే లెవెల్ లో ఉంటుందని ప్రూవ్ చేసింది తమన్నా. తాజాగా తమన్నా తబహీ మ్యూజిక్ వీడియోలో బాలీవుడ్ స్టార్ ర్యాపర్ బాద్షా తో కలిసి చిందులు వేసింది. ఈ పాటకు హితేన్ మ్యూజిక్ అందించాడు. ఇక రీసెంట్ గా రిలీజైన ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ ని రాబట్టడమే కాకుండా యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. ఇక తమన్నా తన ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. తన అందాన్ని మెయింటైన్ చేస్తూ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది.
View this post on Instagram
Advertisement
ఇకపోతే ప్రస్తుతం తమన్నా తెలుగులో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తెలుగులో ఎఫ్ 3, భోళా శంకర్, గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో నటింస్తోంది. అయితే ఇప్పటికే ఎఫ్ 3 సినిమా విడుదలకు సిద్దంగా ఉండగా మరొక రెండు సినిమాలకు సంబందించిన షూటింగ్ త్వరలోనే పూర్తి కానున్నాయి. అయితే కెరిర్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫొటోస్ వీడియోలతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తమన్నాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో తమన్నా బ్లాక్ డ్రెస్ లో మెరిసింది..