...

viral News : భార్య పై ప్రేమతో 90 వేల బైక్ కొన్న యాచకుడు.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!

viral News : సాధారణంగా ఒక యాచకుడు మన వద్దకు వచ్చి డబ్బు అడిగితే మనకు తోచినది ఇస్తాము.మన దగ్గర లేదంటే లేదని చెప్పి పంపిస్తాము. అయితే కొందరు యాచకులు చూస్తే ఎంతో అస్యహించుకుంటారు. కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే వారి దగ్గర మనకన్నా ఎక్కువ ఆస్తిపాస్తులు ఉంటాయని.ఇలా ప్రతి రోజు యాచించి ఎంతో మంది పెద్ద ఎత్తున డబ్బును పోగుచేసిన వారు ఉన్నారు. ఇలాంటి సంఘటనలు మనం ఇదివరకు ఎన్నో చూసాము. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది.

viral News
viral News

మధ్యప్రదేశ్ కి చెందిన ఒక యాచకుడు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సంతోష్ కుమార్ సాహు అనే యువకుడు ప్రతిరోజు యాచించి డబ్బును కూడబెట్టి తన భార్య పై ప్రేమతో ఏకంగా 90 వేలు విలువ చేసే ఒకే మోటార్ బైక్ కొన్నాడు. ఈయన తన భార్యతో కలసి ఎంచక్కా మోటార్ బైక్ పై నగర వీదులలో చక్కర్లు కొడుతున్నారు.ఈ సందర్భంగా యాచకుడు మాట్లాడుతూ తనకు గతంలో కూడా ఒక వాహనం ఉందని తెలిపారు.

గతంలో ఉన్న వాహనం పై ప్రయాణం చేయడం వల్ల తన భార్యకు వెన్ను నొప్పి రావడం వల్ల మరో కొత్త వాహనం కొనుగోలు చేశామని తెలిపారు.ఇలా భార్య పై ప్రేమతో యాచకుడు ఖరీదైన మోటార్ బైక్ కొనుగోలు చేశారని తెలియడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. తన భార్య ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని యాచకుడు ఖరీదైన మోటార్ బైక్ కొనుగోలు చేయడంతో తన భార్య పై ఉన్న ప్రేమను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Read Also : Viral video : సెల్ఫీ కోసం బైక్ పై స్టంట్.. చివరకు కిందపడి ఫట్!