Tamanna Bhatia : టాలీవుడ్ భామ మిల్క్ బ్యూటీ.. తమన్నా భాటియా.. ముట్టుకుంటే మాసిపోయేంత అందం.. తనదైన అందంతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. మొన్నటివరకూ హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ చేసిన ఈ పాలరాయి భామ.. ఐటెం సాంగుల్లో మెరిసిపోతోంది. తమన్నాతో డ్యాన్స్ చేయాలంటే హీరోలు కూడా ఆలోచిస్తారంటే అతిశయోక్తి కాదు.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ రేంజ్ వరకు ఎదిగిపోయిన తమన్నా రూటే సపరేట్.. ప్రస్తుతం వెబ్ సిరీస్ ల్లోనూ తనదైన నటనతో దూసుకుపోతోంది. స్పెషల్ సాంగ్స్ అంటే రెడీ అంటోంది. తమన్నా వేసే స్టెప్పులకు ఎవరైనా ఫిదా కావాల్సిందే..
బాలీవుడ్ స్టార్ ర్యాపర్ బాద్షాతో తమన్నా డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు రాణించాలంటే.. అందమే కాదు.. అందుకు తగినట్టుగా అభినయం, ఫిట్ నెస్ కూడా తప్పనిసరిగా ఫాలో కావాలి. లేదంటే సినిమా అవకాశాలు తగ్గిపోతాయి. పాపులారిటీ కూడా పడిపోతుంది. అందుకే హీరోయిన్లు తమ శరీరాన్ని సరైన డైట్‌తో సెట్ చేస్తుంటారు. ఆరోగ్యంతో పాటు బాడీని సరిగా ఉంచుకోవాలి. అప్పుడే సినిమా అవకాశాలు తలుపు తడుతాయి. జిమ్ కు వెళ్తూ తమ బాడీ షేప్ కోసం గంటల కొద్ది కసరత్తు చేస్తుంటారు. అదే నాజుక్కు అందంతో తమన్నా ఇప్పటికీ కుర్రకారును కట్టిపడేస్తోంది.
ప్రస్తుతం తమన్నా వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గనీ మూవీలో స్పెషల్ సాంగ్ కు చిందులేసింది. తమన్నా ఒక భాషకే పరిమితం కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం తమన్నా చేతిలో తెలుగులో వస్తున్న F3, గుర్తుందా శీతాకాలం, భోళా శంకర్ మూవీల్లో నటిస్తోంది. ఈ మూవీల షూటింగ్స్ అతి త్వరలోనే పూర్తి కానున్నాయి. హిందీ సినీ పరిశ్రమలో తమన్నా రెండు మూవీలు చేస్తోంది.
Tamanna spotted after her rehearsal #Tamannaah #TamannaahBhatia pic.twitter.com/wDbLZ8f404
Advertisement— Star Frames (@starframesoffl) April 18, 2022
Advertisement
అంతేకాదు.. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ తన అభిమానులు, ఫాలోవర్లను అలరిస్తుంటుంది తమన్నా.. సగం సగం బట్టలతో కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల తమన్నా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమన్నా ఫొటోలు, వీడియోలను చూసి నెటిజన్లు వావ్ సో క్రేజీ అంటున్నారు. ఫొటోషూట్, బీచ్‌లో సైకిల్ తొక్కుతూ తమన్నా చేసే విన్యాసాలు కుర్రకారులో సెగలు రేపుతున్నాయి. ఇటీవల మాల్దీవ్స్ వెళ్లిన తమన్నా అక్కడ పోస్టు చేసిన బీచ్ ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. తమన్నా తన అందాలతో కనువిందు చేస్తూ ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది..