Sri Reddy : ఏపీలో థియేటర్స్ టికెట్స్ ప్రైసెస్ తగ్గించడాన్ని కొందరు సినీ ప్రముఖులు తప్పుబడుతున్నారు. ఈ విషయమై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు వర్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీ అనే సీన్ క్రియేట్ అయింది. ఈ వివాదంలోకి తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దూరిపోయాడు. ట్విట్టర్ వేదికగా ఆయన సంధించిన ప్రశ్నలకు వైసీపీ నేత, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. కాగా, ఈ వివాదంలోకి మరో వ్యక్తి వచ్చారు. ఆమెనే శ్రీరెడ్డి.. టికెట్ల ధరల తగ్గింపు విషయమై ఆర్జీవీ కామెంట్స్‌పైన ఫైర్ అయింది శ్రీరెడ్డి.
ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూడొద్దని ఆర్జీవికి సూచించింది. జగన్ ప్రభుత్వం జోలికి వెళ్లాలంటే ముందు తనను దాటుకుని వెళ్లాలని ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి హెచ్చరించింది. ఫేస్ బుక్‌లో ఈ మేరకు వీడియో రికార్డు చేసి విడుదల చేసింది శ్రీరెడ్డి. సదరు వీడియోలో శ్రీరెడ్డి ఎక్సర్ సైజెస్ చేస్తూ ఈ వివాదంపైన స్పందించింది.
ఆర్జీవీని బాలీవుడ్ చీ.. తూ.. అని తరిమేస్తే టాలీవుడ్‌కు వచ్చాడని, ఇక్కడ తగుదునమ్మా అని టికెట్ల ధరల విషయం మాట్లాడుతున్నాడని మండిపడింది శ్రీరెడ్డి. టికెట్ల ధర విషయమై మాట్లాడే క్రమంలో ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని సరైన కౌంటర్ ఇచ్చారని ఈ సందర్భంగా శ్రీరెడ్డి ప్రస్తావించింది. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి మాట్లాడుతూ తన సినిమాలను ఓటీటీలో విడుదల చేసే ఆర్జీవీకి థియేటర్స్ టికెట్స్ ప్రైసెస్ గురించి అవగాహన లేదని ఆరోపించింది. ఆర్జీవీ, సురేశ్ బాబుతో కలిసి గతంలో తనపై చాలా చేశాడని విమర్శించింది. కేవలం మీడియాలో, వార్తల్లో నిలిచేందుకే ఆర్జీవీ ఇలా థియేటర్స్ టికెట్ల ధరల విషయంలో ఇన్వాల్స్ అయ్యారని అంది శ్రీరెడ్డి.
Read Also : Srireddy Bold Comments : ‘మీ బోడి పెద్దరికం ఎవడు అడిగాడు’.. మెగాస్టార్ చిరంజీవిపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు!