sravana bhargavi : శ్రావణ భార్గవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆమె ప్రముఖ సింగర్. 2009 నుండి శ్రావణ భార్గవి సింగర్ గా కొనసాగుతున్నారు. చాలా సినిమా పాటలకు తన గాత్రం అందించారు శ్రావణ భార్గవి. ఆమె ఒక సింగర్ మాత్రమే కాదు.. గీత రచయిత్రి కూడా. ఆమె ఇటీవల అన్నమయ్య కీర్తనను ఆలపిస్తూ ఓ వీడియో చేశారు. ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానల్ లో పోస్టు చేశారు.

ఒకపరి కొకపరి వయ్యారమయ్యే అనే అన్నమయ్య కీర్తనపై చేసిన వీడియోతో.. శ్రావణ భార్గవి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అన్నమయ్య వారసులు ఆ వీడియో యూట్యూబ్ నుండి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. స్వామి వారి అభిషేకంలో ఆ కీర్తనను ఆలపిస్తారని… అలాంటి పవిత్రమైన కీర్తనను అలా చూపించడం పద్ధతి కాదని చెబుతున్నారు. ఈ వీడియోకు సంబంధించి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అన్నమయ్య వారసులు.. డైరెక్ట్ గా శ్రావణ భార్గవికే ఫోన్ చేశారు. ఫోన్ లో తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా ఒక అమ్మాయి పడుకుని ఉన్నట్లు చూపిస్తూ ఈ కీర్తనను చూపించడం సరికాదని.. దానినిన యూట్యూబ్ నుండి తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
చాలా పద్ధతిగా చేసిన అన్నమయ్య వారసుల విజ్ఞప్తిని శ్రావణ భార్గవి తోసిపుచ్చారు. తనకున్న సంగీత జ్ఞానంతోస భక్తి శ్రద్ధలతో పాడాను. అందులో ఏదీ తప్పుగా చూపించలేదంటూ… ఆ వీడియోను యూట్యూబ్ నుండి తొలగించడానికి నిరాకరించారు. కావాలంటే యూట్యూబ్ కే ఫిర్యాదు చేసుకోండని.. తాను మాత్రం తీసేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు శ్రావణ భార్గవి. ఆ కీర్తనలో తప్పు ఉంటే ఆ దేవుడే ఏదొక రూపంలో శిక్షిస్తాడని చెప్పుకొచ్చారు ఈ సింగర్.

Read Also : Shravana bhargavi : ఏంటీ శ్రావణ భార్గవి, హేమ చంద్ర విడిపోతున్నారా..?
