Karthika Deepam july 21 Today Episode : నిరుపమ్ ఫోన్ ని తిరిగిచ్చేసిన సౌర్య.. సౌర్య,నిరుపమ్ ని కలిపే ప్రయత్నంలో ప్రేమ్..?

Sourya returns Nirupam's phone in todays karthika deepam serial episode
Sourya returns Nirupam's phone in todays karthika deepam serial episode

Karthika Deepam july 21 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిరుపమ్, సౌర్య ఒకే కారులో ప్రయాణిస్తూ ఉంటారు.  ఈరోజు ఎపిసోడ్ లో సౌర్య, నిరుపమ్ ఒకే కారులో ప్రయాణిస్తూ ఒకరి గురించి ఒకరు మనసులో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే సౌర్య అని నేను ఎవరిని మోసం చేయలేదు కదా నేనెందుకు ఇలా ఉండాలి అనుకొని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది. కావాలనే వేరే వాళ్ళకి కాల్ చేసినట్టుగా చేసి ఫోన్ లో మాట్లాడుతూ పరిస్థితులు ఎప్పుడూ ఒకటే విధంగానే ఉండవు.

Sourya returns Nirupam's phone in todays karthika deepam serial episode
Sourya returns Nirupam’s phone in todays karthika deepam serial episode

ఈరోజు ఆటో డ్రైవర్ గా ఉన్నవారే రేపు కారు ఓనర్ గా మారవచ్చు. కారు ఓనర్ గా ఉన్న వారి డ్రైవర్ గా కూడా మారవచ్చు అంటూ నిరుపమ్ ఉద్దేశించి మాట్లాడుతుంది. సౌర్య ఫోన్ కట్ చేసిన తర్వాత నిరుపమ్ సౌర్యతో మాట్లాడగా అప్పుడు వారిద్దరూ కాసేపు ఫన్నీగా గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు సౌర్య నేను మధ్యలో వచ్చాను మధ్యలో నుంచి దిగిపోతాను అని కారు దిగగా ఇంతలోనే ఇల్లు వచ్చేస్తుంది. ఇంతలోనే అక్కడికి సౌందర్య వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు నిరుపమ్, ప్రేమ్ వెళ్దాం పద అని అనగా అప్పుడు ప్రేమ్ ఇంకొద్దిసేపు ఉందాం అని అనడంతో పెళ్ళాం పద అని అంటాడు. అప్పుడు సౌర్య డాక్టర్ సాబ్ అనే పిలవగా అందరూ ఎందుకు పిలిచిందా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సౌర్య,నిరుపమ్ దగ్గరికి వెళ్లి నిరుపమ్ ఇచ్చిన మొబైల్ ను తిరిగి ఇచ్చేస్తుంది.

Advertisement

Karthika Deepam : సౌందర్య ఇంట బోనాల పండగ… నిరుపమ్, హిమ కు షాక్ ఇచ్చిన జ్వాల….

ఆ తర్వాత ఆనంద్ రావు కార్తీక్ దీపలను తలుచుకుని బాధపడుతూ ఉండగా ఇంతలో సౌందర్య అక్కడికి వస్తుంది. అప్పుడు ఎందుకు బాధపడుతున్నారు సౌర్య వచ్చింది కదా అని అనగా వెంటనే ఆనందరావు సౌర్య వచ్చింది అని ఆనందపడాలో ఏంటి వారిద్దరూ మాట్లాడుకోవడం లేదు అని బాధపడాలో అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉండగా అప్పుడు సౌందర్య నాకు మాత్రం ఎప్పుడు ఎప్పుడు తెల్లవారుతుందా? బోనాల పండుగ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నాను అని అనగా ఆనందరావు కూడా అప్పుడు సంతోషంతో అమ్మవారి దయవల్ల వారిద్దరూ కలిసి పోతే బాగుంటుంది అని ఆనందపడతాడు.
ఆ తర్వాత సౌందర్య వాళ్ళు అమ్మవారికి బోనం సమర్పించడానికి తయారు చేస్తూ ఉండగా ప్రేమ్ అందరికీ ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనేఎలా అయినా నిరుపమ్, సౌర్య లను కలపాలి అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత అమ్మవారికి బోనం సమర్పించడానికి వెళ్తూ ఉండగా అప్పుడు ప్రేమ్,నిరుపమ్, సౌర్యలను పక్కపక్కన నిలబెట్టి ఫోటోలు తీస్తాడు. ఇక ఇంద్రుడు మాత్రం డాన్స్ వేస్తూ ఆనంద పడుతూ ఉంటాడు.

ఆ తర్వాత అందరూ కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత పూజారి అమ్మవారి గొప్పతనం వివరించి ఆ హుండీలో మీ మనసులో కోరిన కోరికను రాసి అందులో వేస్తే తప్పకుండా తీరుతుంది అనడంతో ప్రేమ్ హిమ గురించి రాసి అందులో వేయాలి అని అనుకుంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో నిరుపమ్, సౌర్యల పెళ్లి జరగాలి అనే చీటీలో రాసి హుండీలో వేస్తుంది హిమ. ఆ తర్వాత సౌర్య కూడా మనసులో ఒక కోరిక కోరుకొని హుండీలో వేస్తుంది. ఆ తరువాత ఆ చీటీని చూసిన హిమ ఒకసారి గా షాక్ అవుతుంది.

Advertisement

Read Also : Karthika Deepam july 20 Today Episode : హిమ,సౌర్య లను కలిపి ప్రయత్నంలో సౌందర్య..నిరుపమ్,సౌర్యని ఒక్కటి చేయాలనుకుంటున్న ప్రేమ్..?

Advertisement