Shekar master: పండు మొహం మాడిపోయేలా చేసిన శేఖర్ మాస్టర్.. మామూలుగా లేదుగా

Shekar master: ఢీ డ్యాన్స్ షో కంటెస్టెంట్ పండు గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. డ్యాన్సర్ గా వచ్చిన పండు తర్వాత కమెడియన్ గానూ మారాడు. నక్కిలీసు గొలుసు పాటలో లేడీ గెటప్ వేసి ఒక ఊపు ఊపేశాడు. ఆ ఒక్క పాట పండుకు విపరీతమైన క్రేజ్ ను తీసుకువచ్చింది. వివిధ ఛానళ్లలోని షో నిర్వాహకులు పండు వెంట పడ్డారు. తమ షోల్లో పాల్గొనాలని చాలా మంది ఇన్వైట్ చేశారు. అదే గెటప్ చాలా షోల్లో పాల్గొన్నాడు పండు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, స్టార్ మాలో వచ్చే మరో కామెడీ ప్రోగ్రాం, జీలో వచ్చే మరో ప్రోగ్రాములోనూ పండు కనిపించాడు.

Advertisement

Advertisement

ప్రస్తుతం స్టార్ మాలో వచ్చే కామెడీ స్టార్స్ ధమాకాలో కనిపిస్తున్నాడు పండు. అంతకుముందు జీలో ఒక షోలో పాల్గొన్న పండు.. తర్వాత నాగబాబు వెంటనే స్టార్ మాకు వెళ్లాడు. తాజాగా ఈ షోకో సంబంధించిన ఒక ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమేలో పండు మోహం మాడిపోయినట్లు కనిపించింది. శేఖర్ మాస్టర్, నాగబాబు ఇద్దరు కూడా పండు మీద పంచులు వేశారు. దీంతో పండు గాలి తీసినట్లు అయింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో పండు ఓ నిర్మాతగా కిపించాడు. న్ని కోరికలు తీర్చుకున్నారా.. కానీ ఓ కోరిక మగిలింది అని పండు అంటాడు. దీంతో నాగబాబు, సేఖర్ మాస్టర్ లు కౌంటర్లు వేస్తారు.

Advertisement

Advertisement

అన్నీ తీర్చుకున్నావా.. ఏం ఏం కోరికలురా అంటూ సటైరికల్ గా అంటారు. ఇంతకీ ఆ కోరిక ఏంటని అంటే… శేఖర్ మాస్టర్ ను పెట్టి ఓ సినిమా తీయాలనుకుంటున్నానని పండు చెప్తాడు. ఇక టైటిల్ ఏంటని అడిగితే ఉండలేడు.. ఆగలేడు అని వివరిస్తాడు. అలా టైటిల్ చెప్పడంతోనే శేఖర్ మాస్టర్ మధ్యలోకి దూరి.. అది నేను కాదురా నువ్వు అంటూ రిప్లై ఇస్తాడు. దీంతో పండు మొహం మాడిపోయింది. పక్కనున్న నాగబాబు అయితే పగలబడి నవ్వేస్తుంటాడు.

Advertisement
Advertisement