Godse twitter review : తెలుగు తెరపై విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు హీరో సత్యదేవ్. ఆయన హీరోగా గోపి గణేష్ పట్టాభి తెరకెక్కించిన చిత్రం గాడ్సే.. సీకీ స్క్రీన్స్ బ్యానర్స్ పై ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ ఈ సినిమాను నిర్మించారు. చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. సునీల్ కశ్యప్ బాణీలు కట్టారు. సందేశాత్మక కథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమాను నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సినిమా చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా ఎలా రియాక్ట్ అవుతున్నారు. ఇంతకీ ఈ గాడ్సే జనాన్ని మెప్పించిందాం.
భారత దేశంలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై ఓ సామాన్య యువకుడు చేసే పోరాటం నేపథ్యంతో ఈ గాడ్సే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలోని సన్నివేషాలు ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేసేలా రూపొందించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించడంతో సినిమాపై హైప్ నెలకొంది. అయితే ఇప్పటికే ఈ సినిమా చూసిన వారు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఓవైపు విరాట పర్వం… మరోవైపు గాడ్సే సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయితే ఓ వర్గం ఆడియన్స్ గాడ్సే చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు. ఇందులో హీరో సత్యదేవ్ వన్ మ్యాన్ షో ప్రదర్శించారు. ఆయన డైలాగ్స్ తూటాల్లా పేలాయని అంటున్నారు.
బ్యాగ్రౌండ్ స్కోర్ తో పాటు యాక్షన్ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయని.. ఇవే ఈ సినిమాకు ప్లస్ అని చెబుతున్నారు. అయితే డైరెక్టర్ కథను నడిపించిన విధానం గ్రిప్పింగ్ గా లేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఉత్కంఠ రేపే ఫస్టాఫ్.. అందుకు కొనసాగింపుగా సెకండాఫ్ సాగిపోయిందని అంటున్నారు. ఇకపోతే ఈ ప్రయోగాత్మక సినిమాలో మెగా బ్రదర్ నాగబాబు, బ్రహ్మాజీ, తణికెళ్ల భరణి, నోయల్ సేన్, పృథ్వీ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. వాళ్లందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
Read Also : Virata Parvam Movie Review : ‘విరాట పర్వం’ మూవీ ఫుల్ రివ్యూ.. సినిమాకు ఇదే హైలెట్..!