Samantha : అతడు నా ఎక్స్.. సమంత షాకింగ్ ఆన్సర్!

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest
samantha shocking answer for netizen

Samantha : సమంత అంటే ఇప్పటికీ, ఎప్పటికీ తగ్గని క్రేజ్ ఉంటుంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంతపై మరింత దృష్టి పెడుతున్నారు ప్రతి ఒక్కరు. సమంత వేసుకునే దుస్తులు నుండి చేసే వ్యాఖ్యలు, పాల్గొనే షోలు ఇలా ప్రతి ఒక్కదాంట్లో సమంత ఏం చేస్తుంది. ఏం మాట్లాడుతుందని ఆత్రుతగా చూస్తున్నారు కొందరు. ఎక్కడైన తప్పుగా చిన్న పదమైనా వాడకపోతుందా.. ఆడేసుకుందామని అనుకుంటున్నారు కొందరు సోషల్ మీడియాలో అత్యుత్సాహం కనబరిచే వారు.

samantha shocking answer for netizen
samantha shocking answer for netizen

ఈక్రమంలోనే సమంత కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది. ఆ షోలో సమంత ఓవర్ యాక్షన్ చేసిందని.. మరీ అతిగా బిహేవ్ చేసిందని ఇప్పటికే ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమంత ఎపిసోడ్ రానే వచ్చింది. ఈ ఎపిసోడ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో గురువారం సాయంత్రం టెలికాస్ట్ అయింది. ఇందులో కరణ్ అడిగిన చాలా ప్రశ్నలకు సమంత తడుముకోకుండా ఆన్సర్ చేసింది.

Advertisement

ఈ షోలో కరణ్ సమంతను పలు పర్సనల్ ప్రశ్నలు అడిగాడు. వీటికి చాలా తెలివిగా జవాబిచ్చింది ఈ దూకుడు భామ. ఒక ప్రశ్న అడిగే సమయంలో నీ భర్త అని కరణ్ సంభోదించగానే.. సమంత కల్పించుకుని భర్త కాదు.. మాజీ భర్త అంటూ కరణ్ కు షాకిచ్చింది. సమంత క్లారిఫికేషన్ తర్వాత.. కరణ్ తన క్వశ్చన్ ను సరిచేసుకుని మాజీ భర్త అంటూ తన ప్రశ్నను కొనసాగించాడు.

Read Also :  Samantha : పెళ్లంటేనే ఒక కేజీఎఫ్ అంటూ సామ్ షాకింగ్ కామెంట్లు…!

Advertisement