...

Rocking Rakesh-Jordhar Sujatha : రాకింగ్‌ రాకేష్‌ జోర్దార్‌ సుజాత.. పెళ్లిచేసుకోబోతున్నారా..? ఇందులో నిజమెంత?

Rocking rakesh and jordhar sujatha love: ప్రేమ‌లు, పెళ్లిళ్లు స‌హ‌జం అందులోనూ న‌టీన‌టుల మ‌ధ్య అయితే మరి చెప్పనక్కర్లేదు. అయితే ఈ ప్రేమ‌లు ఎప్పుడు పుడ‌తాయో, ఎప్పుడు బ్రేక‌ప్ అవుతాయో ఎవరికీ తెలియదు. మరి ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నానా అనుకోవచ్చు మీరు. మొన్నామధ్య ప్రేమికుల రోజు సందర్భంగా జబర్ధస్త్‌లో వారివారి ప్రేమల గురించి కొందరు చెప్పారు. వారిలో ఒక జంట రాకింగ్‌ రాకేష్‌ మరియు జోర్దార్‌ సుజాత. యాంకర్‌, న్యూస్‌ రీడర్‌గా తన కెరీర్ ప్రారంభించిన జోర్దార్ సుజాత… బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 4 రియాలిటీ షో తర్వాత అనూహ్యంగా మారిపోయింది. ఒక్కసారిగా సుజాత‌కు సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. అప్పుడప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్ వేదిక‌పై క‌నిపించి ర‌చ్చ చేస్తున్న సుజాత ఇప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుడితోనే పెళ్లిపీటలు ఎక్కబోతుందనే టాక్‌ నడుస్తుంది.

rocking rakesh and jordhar sujatha

గ‌త కొద్ది రోజులుగా సుజాత‌- రాకేష్ ప్రేమ‌లో ఉన్న‌ట్ట‌గా వాళ్లిద్దరి స్కిట్స్ చూస్తే తెలిసిపోతుంది. నిజానికి వీరిద్దరిది టిఆర్పి రేటింగ్ కోసం క్రియేట్ చేసిన ప్రేమ కాదని నిజంగానే ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టుగా వారిరువురి వ్యవహారం చూస్తే కనిపిస్తోంది. తన తల్లి తర్వాత తల్లి సుజాత అంటూ ఈ మధ్య స్కిట్ల ద్వారా ఎమోషనల్ అయ్యాడు రాకేష్‌. అంతేకాకుండా తనకు తన తండ్రి అంటే ఇష్టం అని ఇప్పుడు రాకేష్ తన తండ్రి స్థానంలో ఉండి ప్రేమను పంచుతాడని నమ్మకం ఉందని అందుకే అతని ప్రేమను ఆస్వాదిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది సుజాత.

రాకేష్-సుజాతల జోడీ బావుంటుందని వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారని మరో జబర్ధస్త్‌ ఆర్టిస్ట్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై రాకేష్‌ కానీ సుజాత కానీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.