Jabardasth: భారీగా తగ్గిన జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యూనరేషన్… తనకు మినహా అందరికీ తగ్గింపు!

Jabardasth: గత తొమ్మిది సంవత్సరాల నుంచి బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్లు మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించే మనో, రోజా యాంకర్స్ రష్మి అనసూయ వంటి వారు ఎంతో ఫేమస్ అయ్యారు.

ఇక ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న రోజా ఒక్కో ఎపిసోడ్ కు ఐదు లక్షల రూపాయల వరకు తీసుకుంటుందని సమాచారం. అలాగే యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మీ అనసూయ ఒక్కో ఎపిసోడ్ కు లక్ష రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సుడిగాలి సుధీర్ టీమ్ మెంబర్స్ కు ఒక్కో స్కిట్ కు మూడు లక్షలు, హైపర్ ఆది టీమ్ మెంబెర్స్ కు 2.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇలా మిగిలిన టీం మెంబర్స్ అందరూ కూడా రెండు లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమానికి భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకునే కమెడియన్స్, యాంకర్స్, రెమ్యూనరేషన్ పూర్తిగా తగ్గించినట్లు తెలుస్తోంది. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న రోజా పారితోషికం మినహా మిగిలిన వారందరికీ రెమ్యూనరేషన్ తగ్గించారని అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమెడియన్స్, యాంకర్స్ కూడా ఇతర కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్న వీరీ రెమ్యూనరేషన్ ఎప్పుడు పెరుగుతుందో తెలియాల్సి ఉంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel