Actress Himaja: హిమజా పెళ్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయినా తల్లి.. తోడు వద్దా అంటూ!

Actress Himaja: కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన నటి హిమజ ప్రస్తుతం అందరికీ ఎంతో సుపరిచితమే. ఇలా బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటించిన ఈమె బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.ఇలా బిగ్ బాస్ తర్వాత ఈమె తన కెరియర్ లో ఎంతో బిజీగా ఉండి పోయారు.ఈ క్రమంలోనే వరుస షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవానికి హాజరవుతూ బిజీగా ఉన్నారు. అలాగే పలు సినిమా అవకాశాలను కూడా అందుకోవడం, బుల్లితెర స్పెషల్ ఈవెంట్ లకు హాజరవుతూ తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇలా వరుస సినిమాలు సీరియల్స్ బిజీగా ఉన్న హిమజా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే బుల్లితెరపై మదర్స్ డే సందర్భంగా అమ్మకు ప్రేమతో అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా కొందరు నటీనటులు వారి అమ్మలను తీసుకువచ్చి వారికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ బహుమతులను ఇచ్చి తమ తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే హిమజ తన తల్లికి గిఫ్ట్ ఇవ్వగా తన తల్లి కి గిఫ్ట్ తీసుకోనని చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన హిమజా తన తల్లి ఎందుకు అభ్యంతరం తెలియ చేసిందో వెల్లడించారు. తనకు ఒక మాట ఇస్తేనే గిఫ్ట్ తీసుకుంటానని ఈ సందర్భంగా హిమజా తల్లి కోరారు. తాను పెళ్లి చేసుకోవాలని, నీకు తోడు వద్దా అంటూ ఈ సందర్భంగా హిమజా తల్లి ఎమోషనల్ కామెంట్ చేశారు. ఈ మాటలు విన్న హిమజా తనకు కొంత సమయం కావాలని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అనంతరం తన తల్లికి తెచ్చిన బంగారు గాజులను మదర్స్ డే సందర్భంగా తన తల్లికి బహుకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel