Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమా కాబట్టి అందులో చేయడానికి ఒప్పుకున్నాను… రెజీనా షాకింగ్ కామెంట్స్!

Megastar Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రెజీనా కాసెండ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మీడియం రేంజ్ హ

By Ramesh Babu

Published on: March 23, 2022 4:18 PM

Updated on: March 23, 2022 4:18 PM

---Advertisement---

Megastar Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రెజీనా కాసెండ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మీడియం రేంజ్ హీరోలందరి సరసన పలు సినిమాలలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆకట్టుకునే అందం, అభినయం ఉన్న రెజీనాకు ఈ మధ్య కాలంలో ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో తెలుగు తెరకు దూరమైంది. అయితే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రెజీనా ఐటమ్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది.

pjimage 2022 03 23T161847.718ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో రెజీనా నటించారనే సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా వచ్చేనెల ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి రెజీనా  ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ అంటూ సాగిపోయే పాటకు అద్భుతమైన స్టెప్పులు వేశారు. ఇక ఈ పాట కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పలు ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.

Advertisement

ఈ పాట ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రెజీనా ఇకపై ఇలాంటి పాటలలో నటిస్తారా అనే ప్రశ్న ఎదురవగా ఆమె తాను ఐటమ్ సాంగ్స్ లో నటించడం ఇదే చివరి పాట అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. తనకు ఈ పాట కన్నా ముందుగానే ఎన్నో సినిమాలలో ఇలాంటి ఐటమ్ సాంగ్స్ చేయడానికి అవకాశాలు వచ్చాయని అయితే ఇలాంటి పాటలో నటించడానికి ఏమాత్రం ఒప్పుకోనని ఈమె వెల్లడించారు.ఇక ఈ సినిమాలో నటించడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారని తెలిపారు.ఆయన ఒక అద్భుతమైన డాన్సర్ అతని పక్కన నటించాలని ఎప్పటినుంచో కోరిక గా ఉండేది అయితే తన పక్కన చేయడానికి ఇలాంటి అవకాశం రావడంతో ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకున్నానని ఇకపై ఇలాంటి పాటలలో నటించనని రెజీనా వెల్లడించారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.