Rashmi gautham : బోల్డ్ అండ్ హాట్ యాంకర్ రష్మీ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సినిమాలకు సంబంధించిన విషయాలను ఆమె పంచుకుంటుంది కానీ పర్సనల్ విషయాలను మాత్రం అస్సలే బయట పెట్టదు. ఎవరైనా వాటి గురించి అడిగినా చెప్పేందుకు పెద్దగా ఆసక్తి చూపించదు. అయితే రష్మీ తల్లిదండ్రుల విషయంలో చాలా వార్తలు వస్తుంటాయి. అయితే రష్మీ తల్లి సింగల్ పేరెంట్ అని.. ఆమెను తల్లే పెంచి పోషించిందని చెబుతుంటారు. అలాగే రష్మికి తండ్రి లేడని… ఉన్నాడో, చనిపోయాడో కూడా తెలిదయని అంటుంటారు. అయితే మొదటి సారి రష్మీ తన తండ్రి విషయంపై స్పందించింది.
ఫాదర్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఓ ఈవెంట్ చేయబోతోంది. ఇందులో భాగంగా కమెడియన్ల తండ్రులను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా పవిత్ర, రష్మీ, వర్షలు ఎమోషనల్ అయ్యారు. రష్మీకి తన తండ్రి గురించి చెప్పడం ఇష్టం లేక… చెడుగా చెప్పలేక అలా వదిలేసినట్లు కనిపిస్తోంది. పేరెంట్స్ లో చెడ్డ పేరెంట్స్ ఉంటారో లేదో నాకు తలియదు.. అయినా సరే హ్యాపీ ఫాదర్స్ డే ఉంటూ స్టేజీ మీదే ఏడ్చేసింది. తన తల్లి సింగిల్ పేరెంట్ అని.. ఆమె కష్టపడి రష్మీని పెంచిదని ఇది వరకే రష్మీ పలు ఇంటర్వ్యూల్లో తెలిపింది.
Read Also : Anchor rashmi: వీకెండ్ పార్టీలో చిల్ అవుతున్న రష్మీ.. మందు తాగుతూ చిందులు!