Rashmi gautham : యాంకర్ సుధీర్, రష్మీ గౌతమ్ ల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బుల్లితెరపై ఎలా కనిపించినా బయట మాత్రం మంచి స్నేహితుల్లాగానే కలిసి ఉంటారట. అయితే తెరపై మాత్రం అమర ప్రేమికుల్లాగా బిల్డప్ ఇస్తుంటారు. కానీ నిజ జీవితంలో మాత్రం వారు అలా ఉండరు. అయినప్పటికీ వారిద్దరి జంట తెరపై కనిపిస్తే మాత్రం ఆ ప్రోగ్రాం లేదా ఈవెంట్ కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. అయితే గత కొంత కాలంగా వీరిద్దరూ కలిసి ఈవెంట్లు కానీ, షోలకు కానీ హోస్టింగ్ చేయడం లేదు. ఒకరు కనిపిస్తే ఇంకొకరు కనిపించడం లేదు. ఒకరు వెళఅలిపోతే ఆ తర్వాత వారి స్థానంలో మరొకరు కనిపిస్తున్నారు.
అయితే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి గెటప్ శ్రీను, సుధీర్ ఇద్దరూ దూరంగానే వెళ్లిపోయారు. తమ తమ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారని.. అందుకే వెళ్లిపోయారని తెలుస్తోంద. అయితే ఇఫ్పుడు సుధీర్ శ్రీ దేవి డ్రామా కంపెనీ నుంచి కూడా బయటకు వచ్చేశాడు. అతని స్థానంలో రష్మీ యాంకరింగ్ చేస్తోంది. దీనిపై ఆది, రాం ప్రసాద్ లు సెటైర్లు వేశారు. రష్మీతో చేసే… కామెడీ షో నుంచి పాటల ప్రోగ్రాంకు హోస్ట్ గా వెళ్లాల్సి వచ్చిందని సుధీర్ మీద పరోక్షంగా పంచులు వేశారు. నేను ముందు చేస్తాను.. ఆ తర్వాత నువు చెయ్ అని ఇద్దరూ ఈ షో యాంకరింగ్ గురించి ముందే మాట్లాడుకున్నారు కదా అని లేని పోని కొత్త అనుమానాలను సృష్టించారు.
Read Also : Rashmi gautham: ఆ బాధ నాకు కూడా తెలుసంటూ రష్మీ గౌతమ్ కన్నీరు.. ఏమైందో తెలుసా?